MP Santosh Kumar: విజయేంద్ర ప్రసాద్ కు ఎంపీ సంతోష్ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్రప్రసాద్ కు ఎంపీ సంతోష్ కుమార్ ట్వీటర్ ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత రాష్ట్రపతి చేత రాజ్యసభకు నామినేట్ అయినందున మన సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మన స్వంత కథా రచయిత విజయేంద్రప్రసాద్ అంటూ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన లైక్స్‌తో ఫ్లోర్‌ను పంచుకోవడం నాకు గౌరవంగా ఉంటుంటూ.. ట్విటర్ ద్వారా ఎంపీ సంతోష్ కుమార్ అభినందనల వర్షం కురిపించారు. ఎంపీ సంతోష్ కుమార్ తో ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్రప్రసాద్ వున్న ఫోటోను ట్వీట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.
కాగా.. దిగ్గజ స్వరకర్త ఇళయరాజా, ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్ర ప్రసాద్ బుధవారం రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేషన్ల అనంతరం ప్రతిష్టాత్మకంగా నిలిచిన కళాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాజ్యసభకు అర్హులైన ప్రముఖులను ఎంపిక చేసినందుకు ప్రధాని మోడీకి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
అయితే.. కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో నాగార్జున, విజయశాంతి నటించిన జానకి రాముడు చిత్రంతో విజయేంద్ర ప్రసాద్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన..ఆయన రైటర్ గా పనిచేశారు. అలాగే దర్శకుడిగా అర్ధాంగి, శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లి వంటి చిత్రాలను తెరకెక్కించారు. అలాగే సమరసింహా రెడ్డి, సింహాద్రి, సై, విజయేంద్ర వర్మ, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, బాహుబలి సిరీస్, బజరంగీ భాయ్ జాన్, మెర్సల్, మణికర్ణిక, తలైవి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలకు రైటర్ గా పనిచేశారు. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీకి కూడా రైటర్ గా పనిచేస్తూ.. రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం స్క్రిప్ట్ పై చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే..ఇనాళ్లకి విజయేంద్రప్రసాద్ కి ఈ గౌరవం దక్కడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Hearty congratulations to Sri K.V. #VijayendraPrasad garu, our own story writer, who took our cinema to the world stage, as he has been nominated to Rajya Sabha by the President of India. It will be an honour for me to share the floor with likes of him.@ssrajamouli pic.twitter.com/EUPS4eSSal
— Santosh Kumar J (@MPsantoshtrs) July 7, 2022
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!