రాజ్యసభ ఉపఎన్నిక నోటిఫికేషన్ మాటే లేదు..! టీఆర్ఎస్ నేత బండ ప్రకాష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ప్రకాష్ రాజీనామా చేయడం.. ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. రాజీనామా చేసే సమయానికి బండ ప్రకాష్‌కు రాజ్యసభ సభ్యుడిగా ఇంకా రెండేళ్లకుపైగా పదవీకాలం ఉంది. 2024 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉన్న ఆ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తే..…
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు రాజ్యసభ సీటు అనే విషయంపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ వాడివేడి చర్చ నడుస్తోంది. మరోవైపు ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయంటూ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి సాహిత్య, సంగీత, ఆర్ధిక, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన ప్రముఖులను రాజ్యసభకు నేరుగా నామినేట్ చేయనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులుగా 12 మందిని నామినేట్ చేయనున్నారు. ఈ కోటా కిందే ఆరేళ్ళ క్రితం…
ఏపీలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త జిల్లాల అంశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలో ఓ కేంద్రీయ విద్యాలయం ఉండాలనే విషయాన్ని ఆయన రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో ఏర్పడిన కొత్త జిల్లాలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను మంజూరు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర…
పార్లమెంట్లో పెద్దల సభగా పేరు పొందిన రాజ్యసభపై అధికార పార్టీ బీజేపీ పట్టు బిగిస్తోంది. చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో తన బలాన్ని బీజేపీ 100 సీట్లకు పెంచుకుంది. రాజ్యసభలో ఈ స్థాయిలో సీట్లు పొందడం బీజేపీకి ఇదే తొలిసారి. గతంలో ఒక్కసారి మాత్రమే రాజ్యసభలో ఓ పార్టీ 100 కంటే ఎక్కువ సీట్లను హస్తగతం చేసుకుంది. 1990లో కాంగ్రెస్ పార్టీ ఈ ఫీట్ సాధించింది. అప్పుడు పెద్దల సభకు ఆ పార్టీ తరఫున 108 మంది సభ్యులు…
కాంగ్రెస్ పార్టీపై రాజ్యసభ వేదికగా సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… 2 నెలల్లో పదవీ విరమణ చేయనున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా సమావేశమైన రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానంటూ ఛలోక్తులు విసిరారు. ఇక, తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. రాజ్యసభ చైర్మన్‌గా క్రమశిక్షణ, విలువలను,…
ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. చట్టంలో కొన్ని నిబంధనలను సవరించడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేసుకుంది.. దరిమిలా ఎల్ఐసీ వంటి కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను (ఐపీవో మార్గంలో) ముక్కలు, ముక్కలుగా అమ్మకానికి పెడుతోంది. మరికొన్నింటిని హోల్‌సేల్‌గా అమ్మేస్తోందని విమర్శించారు.. పెట్టుబడుల ఉపసంహణకు ప్రతిపాదించిన 36 ప్రభుత్వరంగ సంస్థలలో ఇప్పటికే 8 సంస్థలలో ఈ…
నష్టాల సాకు చూపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను బలి చేస్తారా అంటూ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి… ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ బీమా సంస్థల ప్రైవేటీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న దూకుడు వలన ఆంధ్రప్రదేశ్…
ప్రముఖ నటి, బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ కంట తడిపెట్టారు. మహాభారత్ హిందీ ధారావాహికలో ద్రౌపది పాత్రధారిణిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రూపా గంగూలీ పలు భాషా చిత్రాలలోనూ ఆ తర్వాత నటించారు. ప్రస్తుతం ఆమె బీజేపీ తరఫున రాజ్యసభ్యకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన భీర్భూమ్ విషాదాన్ని ప్రస్తావిస్తూ రూపా గంగూలీ రాజ్యసభలో భావోద్వేగానికి గురయ్యారు. Read Also : KGF Chapter 2 : ట్రైలర్ లాంచ్…
అందరూ ఊహించినట్లే జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా బరిలోకి దించింది. పంజాబ్ నుంచి రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ అభ్యర్థిగా హర్భజన్ సింగ్‌ను ఆప్ ప్రకటించింది. ఈ మేరకు భజ్జీ.. సోమవారం ఛండీగఢ్‌లో నామినేషన్ దాఖలు చేశాడు. ఆప్ రాజ్యసభ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించాడు. ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ కాసేపు మీడియాతో మాట్లాడాడు. క్రీడల్లో…
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన ఆమ్ఆద్మీ ప్రభుత్వం కొలువుదీరింది. భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ హర్భజన్‌కు రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఎమ్మెల్యే సీట్ల ప్రకారం తాజాగా ఆప్‌కు రెండు రాజ్యసభ స్థానాలు లభించే…