Rs.2,000 Notes: రూ.2000 నోట్లకు రెండేళ్ల గడువు..! రద్దు చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎప్పుడు ఏ నోట్లను రద్దు చేస్తారు? అనే టెన్షన్ కొనసాగుతూనే ఉంది.. కొన్ని నోట్ల ముద్రణ ఆగిపోయినా..? మార్కెట్‌లో కనిపించకపోయినా? ఏమైంది? ఏదో జరగబోతోంది? అవి కూడా రద్దు చేస్తారా? అనే ప్రచారం సాగుతూ వస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ కీలక వ్యాఖ్య లు చేశారు. రాజ్యసభలో ఇవాళ మోడీ మాట్లాడుతూ.. రూ.2000 నోట్లను దశలవారీగా రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. ఈ పెద్ద నోట్లు ఉన్నవారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని కూడా ఆయన సూచించారు.. ఇప్పటికే ఏటీఎంల నుంచి రూ.2వేల నోట్లు రావడం లేదని.. త్వ రలోనే ఈ నోట్లను రద్దు చేస్తారనే వదంతులు కూడా మొదలయ్యాయని చెప్పుకొచ్చారు.. ఇక, కేంద్ర ప్రభుత్వంపై ఈ వ్యవహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు సుశీల్ కుమార్ మోడీ.
Read Also: Single Cigarettes Sales Ban: పొగరాయుళ్లకు బిగ్ షాక్.. ఇక, ఇలా అమ్మలేరు.. తాగలేరు..!
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
జీరో-అవర్‌లో పెద్ద నోట్ల వ్యవహారాన్ని లేవనెత్తిన ఆయన, దేశంలోని చాలా ఏటీఎంలలో 2,000 రూపాయల నోట్లు మాయమయ్యాయని, అవి త్వరలో చట్టబద్ధం కాకపోవచ్చునని పుకార్లు ఉన్నాయని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందని, మూడేళ్ల క్రితమే 2000 రూపాయల కరెన్సీ నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేసిందన్నారు సుశీల్ మోడీ.. కాగా, 2016లో ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్లను బ్యాన్ చేసి.. వాటి స్థానంలో
కొత్తగా రూ.2000, రూ.500 నోట్లను ముద్రించి చలామణిలోకి తెచ్చా రు. కానీ, రూ.1000 నోట్లనే రద్దు చేసినప్పుడు రూ.2000 నోట్లను చలామణిలోకి తేవడంలో అర్థం లేదంటున్నారు బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ.. 1,000 రూపాయల నోటు చలామణిని నిలిపివేసినప్పుడు 2,000 రూపాయల నోటు తీసుకురావడానికి ఎటువంటి లాజిక్ లేదన్నారు.. ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లు లేని అభివృద్ధి చెందిన దేశాల ఉదాహరణలను ఉదహరించిన ఆయన.. 2,000 రూపాయల నోట్లను నిల్వ ఉంచడంతోపాటు డ్రగ్స్, మనీలాండరింగ్ వంటి అక్రమ వ్యాపారాల్లో తరచుగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన 2000 రూపాయల నోటు నల్లధనానికి పర్యాయపదంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్రమంగా 2000 రూపాయల నోటును రద్దు చేయాలి. పౌరులు తమ వద్ద ఉన్న 2,000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి 2 సంవత్సరాల సమయం ఇవ్వాలని సూచించారు బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ.
- Tags
- 000 rupee notes
- 2
- ATMs
- bjp
- india
తాజావార్తలు
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!