మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో 9 మంది ఎంపీలు ఉన్నారు.
రాజకీయాల్లో ఉన్నవారు సేవ చేస్తారని ప్రజలు భావిస్తారు. ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజలకు సేవ చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధనవంతులు ప్రజాప్రతినిధులుగా ఎంపికవుతున్నారు.
Milk Price Hike: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది.
రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు సంబంధించిన తీర్మానంలో ఐదుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాపై ప్రివిలేజ్ కమిటీ తన నివేదికలను సమర్పించే వరకు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయబడ్డారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెన్షన్పై రాజ్యసభలో హైడ్రామా కొనసాగింది. మొదట రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ను రాజ్యసభ చైర్మెన్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు లోక్సభలో శుక్రవారం ఆమోదం పొందగా.. సోమవారం రాజ్యసభలో చర్చకు పెట్టారు. ఆర్డినెన్స్ స్థానంలో తీసుకొచ్చిన బిల్లును లోక్సభ గత శుక్రవారం ఆమోదించిన విషయం తెలిసిందే.
కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్లలో ఎంపీ కోటాను పునరుద్దరించే ప్రతి పాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి రాజ్యసభలో కేంద్రం సోమవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చింది.
ఢిల్లీ సర్వీసుల బిల్లు-2023ను కేంద్ర హోం మంత్రి అమిత్షా రేపు(సోమవారం) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్కు బదిలీ చేసే ఆర్డినెన్స్ స్థానే కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన బిల్లును విపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.