Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ను తన అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఈమెతో పాటు రెండోసారి సంజయ్ సిగ్, ఎన్డీ గుప్తాలను నామినేట్ చేసింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)ఈ రోజు నామినేషన్లను ప్రకటించింది.
పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య అధినీయం బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయితే, ఈ మూడు బిల్లులు ఇవాళ రాజ్యసభ ముందు ప్రవేశ పెట్టనున్నారు.
Lok Sabha Security Breach: పార్లమెంట్లో ఈరోజు జరిగిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌లోకి విజిటర్ల రూపంలో వెళ్లి, సభ జరుగుతున్న సమయంలో ఛాంబర్లోకి దూసుకెళ్లారు. పొగతో కూడిన డబ్బాలు పేల్చారు. ఈ ఘటనతో ప్రజాప్రతినిధులు ఆందోళన చెందారు. సరిగ్గా డిసెంబర్ 13, 2001న పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడికి నేటితో 22 ఏళ్లు గడిచాయి. ఇదే రోజున ఇలా ఆగంతకులు దాడికి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు…
రాజ్యసభలో విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లును ఆమోదించుకుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు కేంద్రమంత్రి ఉండనున్నారు.
Ranjeet Ranjan : యానిమల్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఈ వివాదం రాజ్యసభకు చేరింది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సందీప్ వంగా రెడ్డి దర్శకుడు.
అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు కేంద్రం వెల్లడించింది.. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను విడుదల చేసింది కేంద్రం.. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కలిపించింది.. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది.
Supreme Court: సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ విషయంలో రాజ్యసభ ఛైర్మన్‌ని క్షమాపణలు కోరాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. రాఘవ్ చద్దా సస్పెన్షన్ కేసులో ఈ రోజు కోర్టు విచారణ జరిపింది. ఎంపీ క్షమాపణలను సానుభూతితో పరిగణించాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌ని సుప్రీం సూచించింది. విచారణ సమయంలో రెండు పక్షాలు ముందుకు వెళ్లే…
రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. బిల్లుకు మద్దతుగా 215 ఓట్లు రాగా.. రాజ్యసభలో ఒక్కరు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు.