Man Stuck between Rocks: కామారెడ్డి జిల్లాలో అటవీప్రాంతంలో వేటకు వెళ్లిన రాజు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. బండరాళ్ల మధ్య సెల్ ఫోన్ పడిపోవడంతో తీసుకునేందుకు యత్నించిన రాజు… తిరిగి బయటకు రాలేకపోయాడు. పెద్ద బండరాళ్ల మధ్య తలకిందులుగా చిక్కుకుపోయాడు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా, 42 గంటలపాటు అతడు నరకయాతన అనుభవించాడు. అయితే అధికారుల శ్రమ ఫలించి నేడు క్షేమంగా బయటపడ్డాడు. రాజును బయటికి తీసేందుకు రెండు జేసీబీలు, ఇతర యంత్రాలను ఉపయోగించారు. బండరాళ్లను తొలగించి రాజు ప్రాణాలను కాపాడారు. గాయాలపాలైన రాజును వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Raju Saved From The Cave: రెస్క్యూ ఆపరేషన్ సక్సస్.. గుహలో చిక్కుకున్న రాజు సేఫ్
బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుపోయిన వ్యక్తిని సురక్షితంగా రక్షించడంలో కీలక పాత్ర వహించిన కామారెడ్డి జిల్లా ఎస్పీతో పాటు సంబంధిత పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి మంగళవారం సాయంత్రం రాజు ఇరుక్కుపోగా బుధవారం నుంచి సహాయక చర్యలు చేపట్టారు. కాగా రెండు జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో బండరాళ్లను తొలగించి సురక్షితంగా రక్షించడంలో కీలక పాత్ర వహించిన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులతోపాటు అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు, ఇందుకు సహాయ పడిన స్థానిక పౌరులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.