సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రముఖ దర్శకుడి ట్యాలెంట్ కు ఫిదా అయ్యారట. అందుకే ఆయనకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం “అన్నాత్తే”. ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు సిరుత్తై శివ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఈ చిత్రం నవంబర్ 4న విడుదలై, మంచి విజయాన్ని సాధించింది. తమిళనాట కురిసిన భారీ వర్షాలు సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించాయి. లేదంటే సినిమా కలెక్షన్లు మరో రేంజ్ లో ఉండేవి.
Read Also : వైఎస్‌ఆర్‌సీపీ మంత్రి కుమారుడి నిశ్చితార్థంలో చిరు, విష్ణు
తెలుగులోనూ అదే రోజు “పెద్దన్న” పేరుతో విడుదలైన ఈ సినిమా హిట్టా లేదా ఫ్లాపా ?అనే దానిపై సోషల్ మీడియాలో పలు వాదనలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ దర్శకుడు శివ ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారట. ఈ సందర్భంగా దర్శకుడు శివకు రజనీకాంత్ బంగారు గొలుసును కూడా బహుమతిగా ఇచ్చారని టాక్ నడుస్తోంది. రజనీ ఆకస్మిక రాకతో దర్శకుడు శివ కుటుంబం ఆనందాశ్చర్యంలో మునిగిపోయిందట. ఈ స్టార్ దర్శకుడి ఇంట్లో రజినీ మూడు గంటలకు పైగా గడిపారని, ‘అన్నాత్తే’ సినిమా గురించి చర్చించారని అంటున్నారు. కాగా ప్రస్తుతం దర్శకుడు శివ, సూర్య కాంబోలో ఓ సినిమా రాబోతుండగా, మరోసారి రజనీకాంత్‌తో కలిసి ఆయన పని చేయనున్నట్టు సమాచారం.