కాళేశ్వరం కమిషన్ వద్ద మాజీ సీఎస్ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్ట్ విచారణకు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించింది. అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చెప్పిందన్న ఎస్కే జోషి కమిషన్‌కు తెలిపారు.
Rajat Kumar Comments on polavaram project: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల వల్ల కడెం, కాళేశ్వరం కింద కొంత డ్యామేజ్ అయిందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కొంతమంది ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని.. 18 సంస్థలు చూసిన తర్వాత ఒకే చెప్పిన తర్వాత ప్రాజెక్టులు కడతారని ఆయన అన్నారు. కడెం,…
ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యను పరష్కరించడంలో భాగంగా తాజాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) మీటింగ్ జరిగింది. ఇందులో భాగంగా.. పవర్ జనరేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరంపై తాము రాజీ పడేదే లేదని తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి తేల్చి చెప్పారు. శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేస్తున్నారని ఏపీ అభ్యంతరం చెప్పారని, విద్యుత్ అవసరాల కోసం తాము కచ్ఛితంగా ఉత్పత్తి చేస్తామని, ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే…
తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని కోరినట్టు తెలిపారు తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్.. జలసౌధలో ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరిగింది.. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ అమలుపైనే ప్రధానంగా చర్చ జరిగింది.. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు తెరదించాలన్న ఉద్దేశంతో కృష్ణానది యాజమాన్యబోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నెల 14వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.. ఇప్పటికే రెండు బోర్డులు దీనిపై కసరత్తు చేస్తున్నాయి.. అయితే.. ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్న గెజిట్ నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం… గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు…