Sunrisers Hyderabad Scored 87 In First 10 Overs: రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బాగానే పోరాడుతోంది. లక్ష్యం దిశగా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి.. ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో 128 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద లక్ష్యం. కత్తి మీద సాము లాంటిదే. అంత భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేయాలంటే.. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. సమయానుకూలంగా సింగిల్స్, డబుల్స్ తీసుకుంటూనే.. భారీ షాట్లు బాదాల్సి ఉంటుంది. ఆర్ఆర్ బౌలర్లపై విరుచుకుపడి.. బౌండరీల మోత మోగించాల్సి ఉంటుంది.
IPL Ducks: ఐపీఎల్‌లో ఎక్కువసార్లు డకౌట్ అయిన 10 మంది ఆటగాళ్లు
సన్‌రైజర్స్ తరఫున ఓపెనింగ్ చేసిన అన్మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ.. మొదట్లో నిదానంగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రీజులో కుదురుకోవడం కోసం కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నారు. అనంతరం అన్మోల్ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. వీళ్లిద్దరు కలిసి తొలి వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. లక్ష్యం పెద్దది కాబట్టి.. పవర్ ప్లేలో వాళ్లు ఇంకా భారీ షాట్లు ఆడి ఉండాల్సింది. ఇక అన్మోల్ ఔట్ అయ్యాక.. రాహుల్ త్రిపాఠి రంగంలోకి దిగాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న అభిషేక్, రాహుల్.. తమ జట్టుని విజయతీరాలకు చేర్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కాకపోతే.. వీళ్లు ఎక్కువ బంతులు వృధా చేస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే భారీ షాట్లు బాదుతున్నారే తప్ప, ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌తోనే కానిచ్చేస్తున్నారు. మరి.. ఎస్ఆర్‌హెచ్ గెలుపొందుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.
విరూపాక్ష కన్నా ముందు చేతబడుల నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఇవే..