ప్రముఖ తెలుగు యాంకర్ వర్షిణిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెసెంట్ ఐపీఎల్ సీజన్‌లో వర్షిణి స్టేడియంకు వచ్చిన ప్రతిసారి (3 సార్లు) హైదరాబాద్ జట్టు ఓటమిపాలు కావడంతో ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. సెంటిమెంట్స్ ఫాలో అయ్యే ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్.. వర్షిణి మరోసారి స్టేడియంలో కనిపిస్తే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు.
Also Read : Asaduddin Owaisi: సోనియా గాంధీ నుంచి ఇలాంటిది ఊహించలేదు.. ఎన్నికల ప్రచారంపై ఓవైసీ ఫైర్
కొందరు అభిమానులైతే.. సన్‌రైజర్స్‌కు ఉన్న దరిద్రం చాలు.. నువ్వు కూడా తోడైతే ఆ జట్టు గట్టెక్కినట్లే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరైతే అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకే.. ఇంకా సన్‌రైజర్స్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయంటూ వేడుకుంటున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌కు ఇవాళ (మే 7) మ్యాచ్ ఉన్న నేపథ్యంలో సన్ రైజర్స్ ఫ్యాన్స్ వర్షిణిపై నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు. వర్షిణిని స్టేడియంకు వస్తే మళ్లీ ఈ మ్యాచ్ కూడా ఓడిపోతుంది కాబట్టి.. రావొద్దని ఎస్ ఆర్ హెచ్ ఫ్యాన్స్ ప్రాధేయపడుతున్నారు.
Also Read : GT vs LSG: అన్నదమ్ముల మధ్య పోరు.. గెలిచేది ఎవరో..
కాగా, ఈ సీజన్‌లో సన్ రైజర్స్ జట్టు హైదరాబాద్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లను చూసేందుకు వర్షిణి స్టేడియానికి వెళ్లింది. ఏప్రిల్ 18న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 24న ఢిల్లీ క్యాపిటల్స్, మే 4న కేకేఆర్‌తో సన్‌రైజర్స్ ఆడిన మ్యాచ్‌లను ఆమె ప్రత్యక్షంగా వీక్షించింది. ఈ 3 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఓడిపోయింది. మ్యాచ్‌ను చూడటానికి స్టేడియానికి వచ్చిన వర్షిణి తిన్నగా ఉంటే సరిపోయేది. ఆమె చేసిన హడావుడి కారణంగానే ట్రోలింగ్‌కు గురవుతుంది. స్టేడియంలో దిగిన ఫోటోలు, సూర్యకుమార్‌తో వయ్యారంగా తీసుకున్న సెల్ఫీని వర్షిణి తన సోషల్‌మీడియా అకౌంట్ లో షేర్ చేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో వారు వర్షిణిని టార్గెట్ చేసి నెట్టింట విమర్శల పర్వం ఎక్కు పెట్టారు.