SRH vs RR : సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 16వ ఎడిషన్ ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతుంది. టోర్నీలో 52వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడనున్నాయి. జైపూర్ వేదికగా ఇవాళ (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ని సంజూ శామ్సన్, హైదరాబాద్‌ని ఐడెన్ మార్క్రామ్ సారథులుగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు జట్లు బరిలోకి దిగుతున్న రెండో మ్యాచ్ కాగా, అంతకముందు ఏప్రిల్ 2న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై శామ్సన్ సేన 72 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. దీంతోఈ మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధిస్తేనే ఐపీఎల్ 16వ సీజన్‌లో ఇరు జట్ల లెక్క సరిపోతుంది. లేదంటే హైదరాబాద్‌పై రాజస్థాన్ రెండో విజయం నమోదు చేస్తుంది.
Also Read : Russia: రష్యాలో మరో ప్రముఖుడిపై దాడి.. ఉక్రెయిన్, అమెరికా పనే అని ఆరోపణ..
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
ఈ ఐపీఎల్ లో ఇరు జట్లు హైదరాబాద్, రాజస్థాన్ టీమ్స్ మొత్తం 17 సార్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లలో రాజస్థాన్ 9 విజయాలతో పైచేయి సాధించగా, హైదరాబాద్ 8 సార్లు విజయం సాధిచింది. ఇక 18వ సారి తలపడుతున్న ఈ జట్లలో హైదరాబాద్ విజయం సాధించి లెక్క సరిచేస్తుందో లేదో వేచి చూడాలి మరీ. మరోవైపు ఐపీఎల్ 16వ సీజన్ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ చివరి స్థానంలో ఉండగా.. ఇప్పటివరకు ఆరెంజ్ ఆర్మీ ఆడిన 9 మ్యాచ్‌లలో 3 మాత్రమే గెలిచింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు 10 మ్యాచ్‌లలో 5 గెలిచి 4వ స్థానంలో ఉంది.
Also Read : Maoist: జగిత్యాలలో మావోయుస్టుల వార్నింగ్ లెటర్.. కొత్తగూడెంలో భారీ ఎన్‌కౌంటర్..
తుది జట్ల అంచనా :
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(కెప్టెన్& వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, ఆడమ్ జంపా, యుజ్వేంద్ర చాహల్
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్.

తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!