తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ బంద్ కార్యక్రమంలో పాల్గొన కుండా బుచ్చయ్యరు గృహ నిర్బంధం చేశారు పోలీస్ అధికారులు. వైసిపి నాయకులు తమనేతల దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే పోలీసులు పర్మిషన్ ఇస్తారని, మా మీద జరిగిన దాడులు ఖండించడానికి మేము బయటకు వెళ్లకూడదా అని బుచ్చయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను కేంద్రం దృష్టికి తీసుకు వెళతామన్నారు బుచ్చయ్య. తనను గృహ నిర్బంధం చేయడంపై ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన సాగిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసి.. మళ్ళీ మా నాయకులపై దాడులు చేయడం హేయమయింది కాదా అని వారు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేయించడంపై తూర్పుగోదావరి జిల్లాలో నేతలు మండిపడ్డారు. అన్యాయంగా దాడి చేయడమే కాకుండా.. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు తమకు వుందన్నారు.