రేపు టీడీపీ-జనసేన పార్టీల తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవుతుంది. రాజమండ్రిలోనే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన టీడీపీ- జనసేన తొలి జయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటానికి ఇరు పార్టీలు కార్యాచరణ సిద్దం చేయనున్నాయి. కరువు వల్ల రైతులు పడే ఇబ్బందులపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నాయి. విద్యారంగంలో జరుగుతోన్న స్కాంలపై భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశం పైనా భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ – నారా లోకేశ్ నేతృత్వంలో టీడీపీ – జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ కానుంది.
Read Also: Coconut Water: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..!
ఇక, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను టీడీపీ- జనసేన పార్టీలు ప్రకటించాయి. అయితే, ఈ కీలక సమావేశానికిక రాజమండ్రి వేదికగా మారింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న రాజమండ్రినే భేటీకి వేదికగా ఇరు పార్టీలు నిర్ణయించారు. రాజకీయ కార్యక్రమాల స్పీడు పెంచేలా టీడీపీ- జనసేన పార్టీలు ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.