Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో రాజకీయ హాట్‌టాపిక్‌గా మారాయి. రాజా సింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్‌గా చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. “జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారని అన్నారు. టిఆర్ఎస్‌ని గెలిపిస్తారా? లేక కాంగ్రెస్‌ని గెలిపిస్తారా? అనే ప్రశ్నలు ప్రజల నుండి సోషల్ మీడియాలో వచ్చాయని ఆయన అన్నారు.
మొబైల్ లవర్స్కి బంపర్ ఆఫర్.. టాప్ మొబైల్స్ పై భారీ ఆఫర్స్ ప్రకటించిన Motorola..!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో వస్తుంది. మీ గౌరవం ప్రమాదంలో ఉంది. మీరు భారీ ఓట్ల తేడాతో ఓడిపోతే, కేంద్ర అధికారుల ముందు మీ ముఖాన్ని ఎలా చూపిస్తారు? కొద్దిగా ఆలోచించారా? అంటూ ఘాటుగానే కేంద్రమంత్రిపై విరుచుక పడ్డారు. ప్రతి పార్లమెంట్, ప్రతి నియోజకవర్గం, ప్రతి డివిజన్‌లో వేలువేసే అలవాటు మీకు ఉంది. కానీ, ఈసారి జూబ్లీహిల్స్‌లో చాలామంది వేలు చేస్తున్నారు. నా జిల్లాను సర్వనాశనం చేసి, నన్ను బయటి పంపించారు. ఒక రోజు మీరు కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది.
DilRaju : సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ కు డైరెక్టర్ దొరికేసాడు