Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
- ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్
- 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్
- 8GB RAM + 128GB స్టోరేజ్ CNY 2,199 (సుమారు రూ.31,000)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo A7 Pro Max: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒప్పో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. Oppo A7 Pro Max పేరుతో వచ్చిన ఈ ఫోన్ భారీ 10,000mAh బ్యాటరీతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఒప్పో నుంచి 10,000mAh బ్యాటరీతో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. క్వాల్కామ్ చిప్సెట్, 120Hz AMOLED డిస్ప్లే, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా వంటి ఫీచర్లతో వచ్చిన Oppo A7 Pro Maxపై స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది.
Oppo A7 Pro Max ధర
చైనా మార్కెట్లో Oppo A7 Pro Max మూడు RAM, స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
8GB RAM + 128GB స్టోరేజ్ CNY 2,199 (సుమారు రూ.31,000)
12GB RAM + 256GB స్టోరేజ్ CNY 2,699 (సుమారు రూ.38,000)
12GB RAM + 512GB స్టోరేజ్ CNY 2,999 (సుమారు రూ.42,000)
ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. విక్రయాలు ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. బ్లాక్, బ్లూ, ఆరెంజ్ కలర్స్ లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే Oppo A7 Pro Maxను భారతదేశంతో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేస్తారా లేదా అనే విషయంపై కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
6.78 అంగుళాల AMOLED డిస్ప్లే
Oppo A7 Pro Maxలో 6.78 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 1,800 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే IP69K రేటింగ్ ఉండటంతో నీరు, దుమ్ము నుంచి మెరుగైన రక్షణను అందించేలా ఈ ఫోన్‌ను రూపొందించారు.
Snapdragon చిప్సెట్తో పనితీరు
Oppo A7 Pro Maxలో Qualcomm Snapdragon 4 Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి గరిష్టంగా 12GB RAM, 512GB స్టోరేజ్ జత చేశారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 5G, 4G LTE, Wi-Fi వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ 10,000mAh బ్యాటరీ. ఒప్పో నుంచి ఇంత భారీ బ్యాటరీతో వచ్చిన తొలి ఫోన్‌గా Oppo A7 Pro Max నిలిచింది. భారీ బ్యాటరీకి తోడు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. ఎక్కువ సమయం ఫోన్‌ను ఉపయోగించే వారికి ఈ బ్యాటరీ సామర్థ్యం ఉపయోగకరంగా ఉండనుంది.
50MP డ్యూయల్ కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా ఉంది. దీనికి అదనంగా 2MP మాక్రో కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరా సిస్టమ్‌లో 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ కూడా ఉంది.
భారతదేశంలో ఎప్పుడు?
ప్రస్తుతం Oppo A7 Pro Max చైనా మార్కెట్‌కే పరిమితమైంది. అక్కడ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి, ఆగస్టు 7 నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి. భారతదేశంలో ఈ ఫోన్‌ను విడుదల చేసే విషయంపై ఒప్పో ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!