Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మార్వాడీలపై జరుగుతున్న ఆరోపణలకు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మార్వడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్ర మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ, గతంలో కోమటీలపై కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. ఆ సమయంలో కోమటి వర్గం సంఘటితంగా ఎదుర్కొని విజయం సాధించిందని అన్నారు. రాజకీయంగా గుర్తింపు లేని వారు కొత్త ఇష్యూ సృష్టించి అల్లర్లు రేపుతున్నారని వ్యాఖ్యానించారు.
గుజరాతీ, మర్వాడీ, రాజస్థానీ వర్గాలు వందల ఏళ్లుగా తెలంగాణలో నివసిస్తున్నారని, రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెడుతున్నారని రాజాసింగ్ తెలిపారు. “ఎవరు ఏ వ్యాపారం చేయాలనుకున్నా చేయొచ్చు, వాళ్లు ఎప్పటినుంచో చేస్తున్నారు. ఫ్రూట్, ఫ్లవర్ వ్యాపారం ఎవరి చేతుల్లో ఉందో చూడండి. ఓల్డ్ సిటీ బంగ్లాదేశ్, రోహింగ్యాల అడ్డాగా మారింది. దానిపై ఎవరూ మాట్లాడటం లేదు” అని ఆయన ప్రశ్నించారు. గుజరాతీలను టెర్రరిస్టులుగా పిలవడం తప్పు అని రాజాసింగ్ అన్నారు. “అలా అయితే మోడీ, సర్దార్ పటేల్, మహాత్మ గాంధీ కూడా టెర్రరిస్టులా? ఇది అసంబద్ధమైన మాట” అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఈ మంటలను ఆపాలని, పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. “డూప్లికేట్ వస్తువులు అమ్మితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. పిర్యాదు చేస్తే కేసు నమోదవుతుంది” అని సూచించారు.
తాను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కుటుంబానికి చెందినవాడినైనా తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తున్నానని రాజాసింగ్ అన్నారు. “తెలంగాణ సమాజం గౌరవప్రదమైన సమాజం. మార్వాడీలు ఎవరి ట్రాప్‌లో పడొద్దు. కమ్యూనిస్టులు ఇలాంటివి చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి” అని పిలుపునిచ్చారు. మార్వాడీలు కేవలం బీజేపీలోనే లేరని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో కూడా ఉన్నారని రాజాసింగ్ తెలిపారు. “బీజేపీలో 70 శాతం ఉంటే, మిగతా 30 శాతం ఇతర పార్టీల్లో ఉన్నారు. మార్వాడీలపై రాజకీయాలు చేస్తే నష్టం చేసుకునేది మీరు మాత్రమే” అని హెచ్చరించారు.
Shocking : కేపీహెచ్‌బీలో ఘోరం.. వేశ్యకు విటుడికి మధ్య ఘర్షణ.. కత్తితో దాడి