బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలి ఇటీవల పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ తేడాగానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. సొంత పార్టీ నాయకుల మీద చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదం అయిన సందర్భాలు సైతం ఉన్నాయి.
త్వరలో బోనాల పండుగ రానుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గుడి కమిటీ సభ్యులకు కీలక సూచనలు చేశారు. బోనాలు ఉత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క గుడి కమిటీ మెంబర్స్ గుడి బయట ఒక బ్యానర్ పెట్టాలని కోరారు. "మద్యం తాగి మా గుడి లోపట రావద్దు" అని అందులో రాయాలన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల ఆరు నెలల తర్వాత ఉంటుందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఉప ఎన్నికల కోసం కుల సమీకరణ ఆధారంగా అభ్యర్థిని బీజేపీ నిర్ణయించబోతోందని పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ముస్లిం ఓట్ బ్యాంకును బీఆర్ఎస్‌కి ఎంఐఎంలు విక్రయించారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు ఏ పార్టీకి అమ్ముతారో చూడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ…
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితుల పట్ల విద్యుత్ శాఖ అధికారి అమానవీయ ప్రవర్తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అభ్యర్థిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. లేఖలో ఇలా రాసుకొచ్చారు. చార్మినార్‌లోని గుల్జార్ హౌస్‌లో జరిగిన వినాశకరమైన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మన నగరాన్ని కలచివేసింది.
సొంత పార్టీ నేతలు టార్గెట్‌గా రాజాసింగ్ చెలరేగిపోతుంటే… స్పందన లేదు ఎందుకు? తీవ్ర పదజాలం వాడుతున్నా… ఇటు ఖండనలు లేవు, అటు షోకాజ్ నోటీస్‌లు లేవు? గోషామహల్ ఎమ్మెల్యే విషయంలో కాషాయ పెద్దల వ్యూహం ఏంటి? క్రమ శిక్షణకు కేరాఫ్‌గా చెప్పుకునే పార్టీ నాయకత్వం ఎందుకు కామ్‌గా ఉంది? అసలు రాజాసింగ్ విషయంలో పార్టీ వైఖరేంటి? కొద్ది రోజులుగా సొంత పార్టీ బీజేపీ మీదికే అస్త్రాలు సంధిస్తున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ మధ్య కాలంలో అయితే..…
Raja Singh : తెలంగాణ పాలిటిక్స్‌లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు అడ్డుగా ఉన్న తనను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అయితే.. కవిత కామెంట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ది రికార్డు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని తాను భావిస్తున్నానంటూ తెలిపారు. బీజేపీకి…
Raja Singh : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ నేత రాజాసింగ్ పార్టీ అధిష్టానాన్ని కీలకంగా కోరారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని వెంటనే నియమించాలని స్పష్టంగా తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాలు కేవలం టైమ్ పాస్ అయిపోయాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. రేపు మరోసారి అలాంటి సమావేశమే జరుగబోతుందంటూ తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై గడువు మరింత పెరిగే అవకాశం ఉంది. పార్టీ…
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వెనకబాటుకు కారణం ఆ రెండు జాతీయ పార్టీలే అని దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మె్ల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. రాజా సింగ్ మాట్లాడుతూ.. కెసిఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడారని అన్నారు. కెసిఆర్ అంటే జుటా.. మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు దేవుడని పొగిడావు.. అప్పుడు ఎందుకు నిధుల గురించి అడగలేదు.. భయ పడ్డావ అంటూ ఎద్దేవా చేశారు.…
MLA Raja Singh: జనాలను రెచ్చగొట్టడానికే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీటింగ్ పెట్టారు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఒవైసీ నీకు దమ్ముంటే ఈ రోజు మీటింగ్ లో నిజం చెప్పు అని అడిగారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామ చంద్ర రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రాజా సింగ్ మా ఎమ్మెల్యే.. పార్టీ రాజా సింగ్ తో మాట్లాడుతుందని తెలిపారు. "కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు అని అనుకుంటా. గౌతం రావు బీజేపీలో కొత్త వ్యక్తి కాదు.. రామ చందర్ రావు రాజా సింగ్ తో మాట్లాడారు.. పార్టీ లోని అందరితో మాట్లాడిన…