Raja Singh Says I have been the MLA of Goshamahal for three years: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పొచ్చని, గోషామహల్‌కు మూడేళ్లు తానే ఎమ్మెల్యే అని పేర్కొన్నారు. కొన్ని తాను తప్పులు చేశానని, సోషల్ మీడియా మరికొన్ని తప్పుడు ప్రచారం చేసిందన్నారు. తమ పార్టీలో మిత్రులు, శత్రువులు ఉంటారని చెప్పారు. మీడియాకు రాజా సింగ్ లీక్‌లు ఇస్తున్నారని మా వాళ్లే కొందరు డిల్లీకి పిర్యాదు చేశారని తెలిపారు. గోషామహల్‌లో ఉప ఎన్నిక రాదన్నారు. బీజేపీ పార్టీకి మాత్రమే రాజీనామా చేశాను అని, ఎమ్మెల్యేగా రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. బీజేపీ తన ఇల్లు అని, రాజా సింగ్ రా అంటే వెంటనే పార్టీలోకి వెళ్లిపోతాను అని రాజా సింగ్ చెప్పారు.
‘నన్ను బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు. కొన్ని నా తప్పులు జరిగాయి, సోషల్ మీడియా మరికొన్ని తప్పు ప్రచారం చేసింది. అమిత్ షా , ప్రధాని మోడీ పోన్ చేశారని తప్పుడు ప్రచారం చేశారు. పార్టీలో మిత్రులు, శత్రువులు ఉంటారు. మీడియాకు రాజా సింగ్ లీక్ ఇస్తున్నారని మా వాళ్లే కొందరు ఢిల్లీకి పిర్యాదు చేశారు. పెన్ డ్రైవ్‌లో నా మీద ఫిర్యాదులు పంపించారు. పిర్యాదులు, సోషల్ మీడియా వార్తలతోనా రాజీనామాను పెద్దలు ఆమోదించారు. గోషామహల్‌లో ఉప ఎన్నిక రాదు. నేను పార్టీకి రాజీనామా చేశాను, ఎమ్మెల్యేగా రాజీనామా చేయలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఉప ఎన్నిక జరగకుండా ఇక్కడ ఎలా జరుగుతుంది. ఉప ఎన్నిక వస్తుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పాత బట్టలు ఐరన్ చేసుకొని తిరుగుతున్నారు. కొందరు మా పార్టీ వాళ్లు కూడా తిరుగుతున్నారు. మూడేళ్లు ఎమ్మెల్యేను నేనే. మా పెద్దవాళ్లు పిలిస్తే ఢిల్లీ వెళ్లి మాట్లాడుతాను. అన్ని విషయాలు పార్టీకి చెబుతాను. చాలా మంది పార్టీనీ ఎందుకు విడిచి వెళ్లరు, ఇతర పార్టీల నుండి వచ్చిన వారు అవమానాలు ఎందుకు భరిస్తున్నారు.. ఇవన్నీ చెబుతాను. ఇవాళ లేకపోతే రేపు అయినా పిలుస్తారు అని అనుకుంటున్నా’ అని ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు.
‘నేను బీజేపీ హై కమాండ్‌ను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మా అధిష్ఠానం పిలుస్తుందనే నమ్మకం ఉంది. వేరే పార్టీలో ఉండలేను, ఆ పార్టీలకి నేను మ్యాచ్ కాను. బీజేపీ నా ఇల్లు, రాజా సింగ్ రా అంటే వెంటనే పార్టీ లోకి వెళ్లిపోతాను. నా వెనుక ఎవరు లేరు. గతం లో 14 నెలలు బీజేపీ నుండి సస్పెండ్ అయ్యాను. నా శత్రువులు పార్టీలో ఉన్నారు, ఇతర పార్టీలో కూడా ఉన్నారు. నేను ఏ పార్టీలోకి వెళ్లినా ఆ పార్టీకి నష్టమే. టీడీపీ, శివసేన, జనసేన ఈ మూడు పార్టీలు మా అలియన్స్ పార్టీలే. ధర్మ ప్రచారం, నియోజకవర్గం ప్రజలే ఈ రెండే నా ముందున్న అంశాలు. నా లాంటి వాళ్ళు వస్తారు పోతారు, బీజేపీ ఉండాలి. తెలంగాణలో ఉన్న వారికి ఇవాళ కాకున్న రేపు అయినా బుద్ధి వస్తుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది’ అని ఎమ్మెల్యే రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు.