రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. వారంలోపు మిగిలిన వారందరికీ రైతు రుణమాఫీ పూర్తి అవుతుందని వెల్లడించారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం అర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని.. ఇది చారిత్రక నిర్ణయమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అని.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం కేసీఆర్, కేటీఆర్‌లకు ఇష్టం లేనట్లుందని ఆయన విమర్శించారు.