ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో రోడ్డుపై ఒక రష్యన్ అమ్మాయి చేసిన హై డ్రామా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వీఐపీ రోడ్డులో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేగంగా వస్తున్న ఇండిగో కారు యాక్టివాను ఢీకొట్టింది. ఆ స్కూటీపై ముగ్గురు యువకులు ఉన్నారు. కారు ఢీకొన్న తీరు చాలా తీవ్రంగా ఉండటంతో స్కూటర్ నడిపే వ్యక్తి కొన్ని మీటర్ల దూరంలో పడిపోయాడు. మిగతా ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కారులో ఒక యువకుడు, రష్యన్ అమ్మాయి ఉన్నారు. వారిద్దరూ ఫుల్లుగా మద్యం తాగారు. కాగా.. ఢీకొట్టిన తర్వాత ఒక రష్యన్ అమ్మాయి కారు నుంచి దిగి తన భాషలో అక్కడున్న వారిని దుర్భాషలాడడం ప్రారంభించింది. ఆ విదేశీ మహిళ పోలీసులను సైతం నెట్టింది. ఈ ప్రమాదానికి గల కారణాన్ని పోలీసులకు చెప్పిన స్థానికులపై దాడికి యత్నించింది.
READ MORE: IND vs ENG: అరంగేట్రం మ్యాచ్లోనే అద్భుత క్యాచ్.. వెనక్కి పరిగెడుతూ.. (వీడియో)
ఈ సంఘటన వీఐపీ మార్గ్‌లో బుధవారం అర్ధరాత్రి 12:30 గంటలకు జరిగింది. ఈ కారును యువకుడు భవేష్ ఆచార్య నడిపాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో భవేష్ ఆచార్య కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆ రష్యన్ అమ్మాయి ఆ యువకుడి ఒడిలో కూర్చున్నట్లు స్థానికులు తెలిపారు. దీని తరువాత ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత, ఆ రష్యన్ అమ్మాయి కారు దిగి అక్కడ ఉన్న వ్యక్తులపై విరుచుకుపడింది. ఆ అమ్మాయి పేరు నోడిరా అని, ఆమె ఉజ్బెకిస్తాన్ పౌరురాలిగా చెబుతున్నారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఇద్దరిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన ముగ్గురు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
A speeding car crashed into a Scooty with 3 youths at midnight, leaving them seriously injured.
Reportedly, a Russian woman was driving while sitting on a man's lap—both were heavily intoxicated. She created chaos at the scene.#Raipur #VIPRoad #Accident #DrunkDriving pic.twitter.com/tWQhVwTHDr— The Vocal News (@thevocalnews) February 6, 2025