హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. తెల్లవారుజాము నుంచే కుండపోత వానమొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌లో భారీగా వర్షం కురిసింది. అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్‌లో ప్రధాన రహదారులపై వరద పొంగిపొర్లుతోంది. కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్టలో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లక్డీకాపూల్, సికింద్రాబాద్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ జంక్షన్లలోని రోడ్లపై నీళ్లు చేరాయి. రహదారులపై చేరిన నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. గండిపేట్,…
ఏపీలో రాబోయే రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణశాఖ. ఈరోజు, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులుతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక రాయలసీమలో కూడా మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అనంతపురం, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది వాతావరణశాఖ. ఇది ఇలా ఉండగా.. నిన్న రాత్రి హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌లో కుండపోత వాన కురిసింది.…
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుండాలి అని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ విషయం పై వైద్య పంచాయితీరాజ్ మున్సిపల్ శాఖలను ఆదేశించారు. వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున, ముందస్తు నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, అధికారులు, వైద్యశాఖ, మున్సిపల్ శాఖల అధికారులతో ప్రగతి భవన్ లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా వుండాలని, అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు…
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇటు విజయవాడ సిటీతో పాటు.. అటు వైజాగ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది.. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది అమరావతి వాతావరణ కేంద్ర… ఏపీలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన…
తెలంగాణలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షల కారణంగా శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 45, 210 క్యూసెకులుగా ఉంది. శ్రీ రాంసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1090 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 90 టిఎంసీలు కాగా ప్రస్తుతం 85 టీఎంసీలు ఉంది. అయితే ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో…
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం, చిరుజల్లులు పడుతుండగా.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు తప్పేలా లేవని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య బంగాళాఖాతం నుంచి నైరుతి దిశవైపునకు వంపు తిరిగి ఉన్నదని, వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయవ్యదిశగా కదలొచ్చని అంచనా వేస్తోంది హైదరాబాద్…
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణశాఖ. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తర కోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని తెలిపారు వాతావరణశాఖ అధికారులు. ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి…
నైరుతీ గాలుల ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాగల 24 గంటల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు,మెరుపులతో కూడి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 24 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. అతి తేలికపాటి నుంచి తేలికపాటి…
భారీ వర్షాలు, వరదలు పలు రైళ్లు రద్దు చేయడానికి.. కొన్ని రీషెడ్యూల్ చేయడానికి దారితీశాయి.. సౌత్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని హౌరా, టికియపరా స్టేషన్ల వద్ద వర్షం నీరు చేరడంతో పలు రైళ్లు రద్దు, దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. యశ్వంత్‌పూర్-హౌరా రైలును రద్దు చేశారు. ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో సిలిచర్‌లో బయలుదేరే సిలిచర్-త్రివేండ్రం, ఐదున గౌహతిలో బయలుదేరే గౌహతి-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు… న్యూ కూచ్ బెహర్, మాతాభాంగ్,…