అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు మండలాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తలుపుల మండలం లో 142.2. మిల్లీమీటర్ల నమోదు కావడంతో తలుపుల మండలంలోని చిన్నపల్లి, మాడిక వాండ్లపల్లి చెరువులకు గండి పడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిన్నపల్లి చెరువు తెగిపోవడంతో ఓదులపల్లి వద్ద వర్షపు నీటి ప్రవాహానికి కదిరి పులివెందుల ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తలుపుల మండలం గొల్లపల్లి వద్ద కదిరి నుంచి విజయవాడ…
అమెరికాలో కరోనా కేసులు తగ్గినట్టుగానే తగ్గి తిరిగి భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఆ దేశంలో లక్ష వరకు కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఒకవైపు కరోనా కేసులతో అతలాకుతలం అవుతుంటే, ఇప్పుడు భారీ వర్షాలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. హరికేన్ ఇదా దెబ్బకు దేశం విలవిలలాడిపోతున్నది. న్యూయార్క్‌లో ఎప్పడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ప్రమాదకరమైన స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. రోడ్లన్ని సెలయేరులా మారిపోవడంతో ఎమర్జెన్నీని విధించారు.…
ఒక ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా పశ్చిమ మధ్య & దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం లలో సగటు సముద్రమట్టానికి 1.5 km నుండి 3.1 km ఎత్తుల మధ్య ఏర్పడింది. దక్షిణ గుజరాత్ నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 km నుండి 5.8 km ఎత్తుల మధ్య నిన్న ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. ఉత్తర కోస్తా…
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రోజున రికార్డు స్థాయిలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని సెలయేరుల్లా మారిపోయాయి. భారీ వర్షానికి రోడ్లతో పాటుగా ఫ్లైఓవర్లకు కూడా వర్షం నీటితో నిడిపోయాయి. ఫ్లైఓవర్ల నుంచి నీరు కిందకు జలపాతంలా జారిపడుతున్నది. ఆ దృశ్యాలను చూసిన కొంతమంది నయగార జలపాతం ఢిల్లీకి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. వికాస్ పురి ప్రాంతంలోని ఫ్లైఓవర్ పై నుంచి వర్షం నీరు కిందకు పడుతున్న దృశ్యాలు ఇప్పుడు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రుతుపవన ద్రోణి పోరుబందర్, సూరత్, జల్గావ్, రామగుండం, మచిలీపట్నంల మీదుగా మరియు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది.ఒక ఉపరితల ద్రోణి దక్షిణ గుజరాత్ నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 km నుండి 5.8 km ఎత్తుల మధ్య ఏర్పడింది. వీటి ప్రభావం వలన…
తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు క్రమంగా పెరుగుతుంది. దాంతో శ్రీశైలంలో మళ్ళీ జలవిద్యుత్ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 50,317 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 34,836 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 873.90 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 158.6276 టీఎంసీలు ఉంది. అయితే ఎడమగట్టు జలవిద్యుత్…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 23,323 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,091 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 874.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 161.2918 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతంకుడి,ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రలలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి…
వాయువ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మంగళవారం వరకు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.. రేపు రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తుండటంతో సముద్రం అలజడిగా ఉంటుంది. కాబట్టి రేపటి వరకు మత్స్యకారులు…