రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డెంగ్యూ టెస్ట్ లు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 1575 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అని మంత్రి ఆళ్ళ నాని అన్నారు గుంటూరు జిల్లా లో 276 డెంగ్యూ కేసులు, 13 మలేరియా కేసులు కూడా నమోదయ్యాయి. డెంగ్యూ గాని మలేరియా గాని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరిక్షలు చేపించేలా ఏర్పాట్లు చేస్తున్నం. గుంటూరు జిల్లాలో శానిటేషన్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ను ఆదేశించాం. డెంగ్యూ కేసులను ఆసరా చేసుకుని…
హైదరాబాద్ లో ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు రోజులు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది అని ఎన్టీవీతో వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న అన్నారు. రాష్ట్రంలో రుతుపవనాలు… దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని తెలిపారు. కాబట్టి ఆ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా 16 జిల్లాలకు…
జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద నీరు కొనసాగుతుంది. హిమాయత్‌సాగర్‌లోకి ప్రస్తుతం 800 క్యూసెక్కుల వచ్చి చేరుతుంది. హిమాయత్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.10 అడుగులకు నీరు చేరింది. దాంతో హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా మూసీ లోకి 700 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇక ఉస్మాన్ సాగర్ లోకి 1200 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఉస్మాన్‌సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1789.50 అడుగులుగా…
గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్ష బీభత్సవానికి హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది… ఈ నేపథ్యంలో.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.. రాగల 4 రోజులపాటు భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయని పేర్కొంది.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మహబూబాబాద్, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, భువనగిరి, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో భారీ…
శ్రీశైలం డ్యామ్‌కు క్రమంగా వరద తగ్గుతూ వస్తోంది… ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ ఇన్ ఫ్లో 28,377 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 23,626 క్యూసెక్కులుగా ఉంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 872.90 అడుగులుగా ఉంది… పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 154.1806 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు.. మరోవైపు.. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతము ఈశాన్య & దానిని ఆనుకుని వున్న తూర్పు మధ్య బంగాళాఖాతం లలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది నైఋతి దిశ వైపుకు వంగి కొనసాగుతున్నది. దీని ప్రభావం వలన రాగల 48 గంటలలో ఉత్తర & దానిని ఆనుకుని వున్న మధ్య బంగళాఖాతం…
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కాస్త తగ్గింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 25,829 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 35,821 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 873.40 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 156.3860 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం…
ఏపీకి మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా పశ్చిమ మధ్య & దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం లలో సగటు సముద్రమట్టానికి 1.5 km నుండి 4.5 km ఎత్తుల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉన్నది. ఈరోజు షీర్ జోన్ (ద్రోణీి) 10°N అక్షాంశము వెంబడి సగటు…
గత నెల రోజుల క్రితం చైనాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వెయ్యేళ్ల కాలంలో ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో వర్షాలు కురవలేదని చైనా అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై నడుం లోతుల్లో నీళ్లు రావడంతో పాటుగా అటు షాపింగ్ మాల్స్, సెల్లార్లు, బస్సులు, రైళ్లు అన్నీ కూడా నీటిలో సగం వరకు మునిగిపోయిన దృశ్యాలను చూశాం. ఆ పరిస్థితి నుంచి బయటపడేసరికి చైనాకు తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. కాగా, ఇప్పుడు అమెరికాను భారీ…