గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో చిగురుటాకులా వణికిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఆస్పత్రులు, కార్యాలయాలకు నీళ్లు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.పశ్చిమబెంగాల్‌లోని బిర్‌భూమ్, బంకురా, వెస్ట్‌మిడ్నాపూర్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. బిర్‌భూమ్‌లోని ప్రముఖ కంకాలితాల ఆలయం నీట మునిగింది. బంకురా జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజస్థాన్‌లోనూ భారీ వరదలకు…
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచిచింది… ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోటర్ల ఎత్తుల మధ్య ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. దీని ప్రభావము వలన 28 జూలై 2021 తేదీన ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. అలాగే పైన జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 3,78,311 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 31,784 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 860.30 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 106.9352 టీఎంసీలు ఉంది.…
పోలవరం ప్రాజెక్టు స్పీల్ వే మీదుగా 8, 60,042 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాఫర్ డ్యాం వద్ద 32. 80 మీటర్లుగ ఉంది గోదావరి వరదనీటి మట్టం. ఇక దేవీపట్నంలో గోదావరి ఉద్ధృతి కొనసాగుతుంది. దేవీపట్నం పోలీసు స్టేషన్, గండి పోచమ్మ ఆలయం నీట మునిగాయి. గండి పోచమ్మ అమ్మవారి ఆలయం గోపురాన్ని వరద నీరు తాకడంతో సమీపంలోని ఇళ్లుకూడా నీట మునిగాయి. దేవిపట్నం మండలాన్ని పోలవరం బ్యాక్ వాటర్ ముంచెత్తాయి. ఏజన్సీలో రహదార్లు…
తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాల కురుస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఎగువ కర్ణాటక నుండి వస్తున్న వరద కారణంగా జూరాలకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. దాంతో ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి దిగువకు 3 లక్షల 80 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుకాగా… ప్రస్తుత నీటిమట్టం 316.670 మీటర్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత…
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. ఇక, భారీవర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 36 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు.. మరికొంతమంది గల్లంతు కాగా.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి.. ఇప్పటికే కొందరిని కాపాటినట్టు తెలుస్తుండగా.. శిథిలాల కింది ఎంతమంది చిక్కుకున్నారనేదానిపై వివరాలు లేవు..…
నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఈ రోజు ఒడిస్సా,పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతములో కొనసాగుతుంది. ఈ అల్పపీడనంకి అనుభందంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కిమీ ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక ప్రదేశములలో రేపు చాలా ప్రదేశములలో మరియు ఎల్లుండి కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి. వాతావరణ హెచ్చరికలు : ఈ…
ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ కు పులిచింతల ప్రాజెక్ట్, మున్నేరు, పాలేరు, కట్లేరు ప్రాంతాల నుంచి ఈరోజు సాయంత్రానికి సుమారు లక్ష క్యూసెక్స్ వరకు వరద నీరు చేరనుంది. వరద ఉధృతి పై అధికారులను మరింత అప్రమత్తం చేసారు కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్. అయితే ప్రస్తుతo ఇన్ ఫ్లో 33,061 అవుట్ ఫ్లో 31,500 క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్…
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో సైతం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లోకి వరద నీరు పోటేత్తింది. ఒకవైపు ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద, మరోవైపు భారీ వర్షాల కారణంగా వస్తున్న వరద నీటితో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మరికొన్ని రోజులు వర్షాలు…
మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమటిచేను సల్పలా వాగు ప్రాజెక్ట్ మత్తడి వద్ద గురువాపూర్ కి చెందిన శ్రీనివాస్ శ్రావణ్, ప్రసాదులు చేపలు పట్టడానికి వెళ్లి వరద నీరు ఎక్కవ కావడం తో బయటకు వెళ్ళడానికి వెళ్లలేక ప్రాణ భయంతో చుట్టూ నీరు మధ్యలో ఒక మట్టి కుప్ప లాగా ఉన్న ప్రాంతం లో చిక్కుకొని నీటిలో ముగ్గురు యువకులు ఉన్నారు . సమాచారం మేరకు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో…