హాట్ వెదర్ నుంచి రిలీఫ్ లభించింది. హైదరాబాదులో మంగళవారం మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్, హైదర్ నగర్, రాంనగర్, అంబర్ పేట, ప్యాట్నీ, బంజారాహిల్స్, ఆల్విన్ కాలనీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఎల్బీ నగర్, మలక్ పేట, సికింద్రాబాద్, లక్డీకాపూల్, కూకట్ పల్లి, అమీర్ పేట, వనస్థలిపురం, బోయిన్ పల్లి, బేగంపేట, పంజాగుట్ట, సోమాజిగూడ, ఓయూ, ఆల్విన్ కాలనీ, రామ్ నగర్, నిజాంపేట, మన్సూరాబాద్, చిలకలగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కాగా, కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కి అంతరాయం కలగడంతో జనం ఇబ్బందులు పడ్డారు.