వాతావరణం మారిపోతోంది. మండు వేసవిలో అకాల వర్షాలు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. నేడు శ్రీకాకుళం,మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ,ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుంది. కాసేపట్లో ఉభయగోదావరి,కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం వుందని హెచ్చరించింది.
Read Also: Monday Bhakthi Tv live: అపమృత్యుభయ నివారణకు ఈ స్తోత్రం పఠించాలి
సాయంత్రం నుంచి రాయలసీమలో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం వుంది. ఎక్కడైనా ఎపుడైనా ఉరుములు మెరుపులతో వర్షం ఉన్నప్పుడు చెట్ల క్రింద ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పొలంలో రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఈ నెల 25 వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ. ఏపీలోని పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Read Also: Katrinakaif : ప్రెగ్నెంట్ అయిన కత్రినా కైఫ్ ?