రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల వర్షం పడుతోంది. నిర్మల్ జిల్లా భైంసా, ఖానాపూర్, కడెం మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. ఇటు ఏపీలోని ప్రకాశం జిల్లా దర్శిలో ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, పొంగి పొర్లుతున్న డ్రైనేజ్ కాలువలు, కాటేరు వాగు పొంగడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.