Monsoon: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 24 గంటల వ్యవధిలో 115.5 మిల్లీమీటర్లకు మించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ముంబయి, శాటిలైట్ నగరాలతో సహా కొంకణ్ ప్రాంతంలో రుతుపవనాలు ఉత్తర దిశగా కదులుతున్నందున మరింత బలపడే అవకాశం ఉందని పూణేలోని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త కేఎస్ హోసలికర్ తెలిపారు. ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనీ, కొంకణ్, విదర్భ, మధ్య మహారాష్ట్రలకు కూడా హెచ్చరికలు జారీ చేయనున్నట్టు తెలిపారు.
Read also: Salaar: ప్రభాస్ పక్కన మరో కన్నడ స్టార్ హీరోని రంగంలోకి దించిన ప్రశాంత్ నీల్…
Also Read
- Bengaluru Metro: “నేను వణికిపోతున్నా”.. మెట్రోలో మహిళ వీడియో వైరల్.. కేసు నమోదు
- Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
- SCO Civilisational Dialogue Forum: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పరిణామం.. SCO సమావేశానికి పాక్ మంత్రికి భారత్ ఆహ్వానం!
- DRDO Scientist: ఆ కారణంతో.. బెంగళూరులో DRDO శాస్త్రవేత్త ఆత్మహ*త్య
రాబోయే 4, 5 రోజుల్లో తూర్పు మధ్య, వాయవ్య, పశ్చిమ భారతదేశంలో చురుకైన రుతుపవనాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, పశ్చిమ హిమాలయ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లోని మరికొన్ని ప్రాంతాలకు, జమ్మూ, కాశ్మీర్, లడఖ్ లోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు సోమవారం విస్తరించాయని తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, రాజస్థాన్ లోని మరికొన్ని ప్రాంతాలు, హర్యానా, పంజాబ్ లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. తూర్పు.. దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య భారతంలో వచ్చే 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జూన్ 29, 30 తేదీల్లో అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటనలో తెలిపింది.
Read also: Atiq Ahmed Case: గ్యాంగ్‌స్టర్ హత్య.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన అతిక్ అహ్మద్ సోదరి
వాయవ్య భారతదేశంలో, పశ్చిమ హిమాలయ ప్రాంతం, వాయువ్య భారతదేశంలోని మైదానాలలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి, మోస్తరు నుండి విస్తృతమైన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 29న తూర్పు రాజస్థాన్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. జూన్ 27, 28 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 27న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాబోయే 3, 4 రోజుల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, విదర్భలలో తేలికపాటి నుంచి విస్తృతమైన వర్షాలు, ఉరుములు మెరుపులతో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ భారతదేశంలో, రాబోయే 5 రోజులలో తేలికపాటి నుండి చాలా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులలో ఈ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 27 న కేరళ, మాహేలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 26 నుంచి 30 వరకు కోస్తా కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 29, 30 తేదీల్లో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, రానున్న 5 రోజుల్లో పశ్చిమ భారతంలో తేలికపాటి నుంచి మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 26 నుంచి 30 వరకు కొంకణ్, గోవా, గుజరాత్ రాష్ట్రం, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తాజావార్తలు
-
Bengaluru Metro: “నేను వణికిపోతున్నా”.. మెట్రోలో మహిళ వీడియో వైరల్.. కేసు నమోదు
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
-
Bandi Sanjay: కరువు మండలాల జాబితాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం..
-
Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
ట్రెండింగ్
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!