Rain Alert: తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు మరోసారి వర్ష హెచ్చరిక జారీ చేశారు. నేటి నుంచి రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధిలో సోమవారం అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇది బుధవారం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సిరిసిల్ల, జనగాం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఉదయం పూట పొగమంచు, మంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశలో గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21.3 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ శాతం 83గా నమోదైంది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Read also: Telangana Election 2023: రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి సభలు.. రోడ్ షోలు.. వివరాలు ఇవే..
ఈరోజు ఏపీలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని దిగువ ట్రోపోస్పియర్‌లో తూర్పుగాలులు వీస్తున్నాయని తెలిపారు. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నిన్న దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 27వ తేదీ ఉదయం 8.30 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రం, మలక్కా జలసంధి పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడింది. ఇది 29 నవంబర్ 2023 నాటికి పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ వాయుగుండం వాయువ్య దిశగా కదులుతుందని, రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం ఆగ్నేయంలో తుపాను బలపడే అవకాశం ఉందన్నారు. ఏపీ, యానాంలోని ట్రోపోస్పియర్‌లో తూర్పు, ఆగ్నేయ దిశలో గాలులు వీస్తున్నాయని తెలిపారు.
Hyderabad: ఎన్నికల వేళ ర్యాపిడో సంస్థ బంపర్ ఆఫర్.. ఆరోజు వారందరికీ ఫ్రీ రైడ్