Telangana Rain: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు, నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని చెబుతున్నారు. ఇవి నేటి నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి ఈశాన్య రుతుపవనాల రాక ముందుగానే ప్రారంభం కావచ్చని IMD అంచనా వేసింది.
Read also: Sri Venkateswara Parayanam: శ్రీ వేంకటేశ్వర స్వామి “తులసి అర్చన.. విశేష స్తోత్ర పారాయణం”
ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కర్నూలు, నంద్యాల, పార్వతీపురం మన్యం, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కడప, సత్యసాయి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
G20 Summit 2023: జీ20 సమ్మిట్‌లో ఉపయోగించే.. జీరో ట్రస్ట్ మోడల్ అంటే ఏమిటి?