కాలిఫోర్నియాను (California) ఓ భారీ తుఫాన్ అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో రహదారులు జలమయం కావడంతో పాటు ఇళ్లన్నీ నీట మునిగాయి. బురద ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు రాని లేని పరిస్థితులు దాపురించాయి. మరోవైపు అధికారులు సహాయచర్యలు చేపట్టారు. రోడ్లపై పేరుకు పోయిన రాళ్లను, చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తీరప్రాంతాలన్నీ దాదాపుగా వరదల్లో చిక్కుకున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో తీవ్రమైన వరదలు, వడగళ్ళు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా తాజాగా కాలిఫోర్నియాలో శీతాకాలపు తుఫానులు తీవ్రరూపం దాల్చాయని అధికారులు పేర్కొన్నారు.
రాబోయే కొద్ది రోజుల్లో స్వల్ప టోర్నడోలు కూడా సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాస్ ఏంజిల్స్, శాంటా బార్బరా మరియు శాన్ డియాగో రాబోయే రెండు రోజుల్లో అత్యంత వరద ప్రమాదాన్ని ప్రధాన నగరాలు ఎదుర్కోబోతున్నాయని తెలిపారు.
Fe