రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాటు పలు చోట్లు పిడుగులు పడ్డాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ అకాల వర్షం రైతులను తీవ్ర నిరాశ పరిచింది. నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం…