తెలంగాణ సీఎం కేసీఆర్ భద్రాచలం ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. సీఎం కేసీఆర్ మాట్లాడారు. బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని, శాశ్వత కాలనీల కోసం అధికారులు ఎత్తయిన ప్రదేశాలను గుర్తించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ.1000 కోట్లతో కొత్త కాలనీ నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.10వేలు సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 7,274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించిందని కేసీఆర్…
నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. మంత్రిని చూడగానే బాధితులంతా వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. సర్వం కోల్పోయామని ఆదుకోవాలని విజ్క్షప్తి చేసారు. భూపాలపల్లిలో పలిమెల గ్రామాన్ని గోదావరి వరద ముంచెత్తింది. దీంతో ఆ గ్రామ ప్రజల కోసం మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో పునవారస శిభిరం ఏర్పాటు చేశారు. దీంతో ఈ శిబిరంలో సుమారు నాలుగు వందల పైగా బాధితులు వున్నారు. పునరావాస శిబిరాన్ని సందర్శించిన మంత్రి సత్యవతి…
భారీ వర్షాలకు చెన్నై అతలాకుతలం అవుతోంది. పోలీసులు, అగ్నిమాపక, ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఓ మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ చేసిన సేవ అందరినీ ఆకట్టుకుంటోంది. వర్షాల వల్ల రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తి సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ విశేషంగా స్పందించారు. ఆ వ్యక్తిని అక్కడినించి తరలించేందుకు సరైన వాహనాలు అందుబాటులో లేవు. వెంటనే స్పందించిన మహిళా పోలీస్ సబ్…