అమేథీలో ఏం జరుగుతోంది. రాహుల్ తిరిగి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? సడన్‌గా నివాసాన్ని ఎందుకు శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే రాజకీయంగా చర్చ సాగుతోంది. తాజా పరిణామాలు అనేక ఊహాగానాలకు తావిస్తోంది.
CM Vijayan: ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సీపీఎం, మిత్ర పక్షం కాంగ్రెస్‌పై విరుచుకుపడుతోంది. జాతీయస్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు బాగానే ఉన్నా, కేరళలోకి వచ్చే రెండు పార్టీల మధ్య మాత్రం విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు ప్రజలు బస్సుల్లో వెళ్లే సమయంలో సీట్ల కోసం కర్చీఫ్ వేసుకునేవారు.. కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అమేథిలో సీటును బుక్ చేసుకునేందుకు కర్చీఫ్ వేస్తారేమోనంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేసింది.
సార్వత్రిక ఎన్నికల రెండో ఘట్టం దగ్గర పడింది. ఏప్రిల్ 26నే రెండో విడత పోలింగ్ జరగనుంది. దీంతో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక విమర్శలు-ప్రతి విమర్శలతో నాయకులు ధ్వజమెత్తుకుంటున్నారు
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాల వల్ల రాంచీలో జరిగే ఇండియా కూటమి ర్యాలీకి ఆయన హాజరుకాలేకపోతున్నారని జైరాం రమేష్ అన్నారు.
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శనివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ajit Pawar: ఈ లోక్‌సభ ఎన్నికలు కుటుంబ సంబధాల గురించి కాదని, ఇది ప్రధాని నరేంద్రమోడీకి రాముల్ గాంధీకి జరుగుతున్న పోరు అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు.
జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు