Rahul Gandhi: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 121 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భోలే బాబా కార్యక్రమానికి హాజరైన ప్రజలు, ఆయన పాదధూళి కోసం ఒక్కసారిగి ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఘటనకు కారకులైన నిందితులనున పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, హత్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం పెంచాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, యూపీ సర్కార్‌ని డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా ఆయన పరిహారం పెంచాలని సీఎం యోగిని కోరారు. శుక్రవారం ఆయన అలీఘర్, హత్రాస్ ప్రాంతాల్లో పర్యటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఘోర నష్టానికి పరిహారం ఎంతిచ్చిన సరిపోదని ఆయన పోస్ట్ చేశారు.
Read Also: Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ నోట మళ్లీ “ఖలిస్తాన్” మాట.. తన తల్లి వ్యాఖ్యలపై మండిపాటు..
121 మంది ప్రాణాలు బలిగోన్న ఈ విషాద ఘటనలో జిల్లా యంత్రాంగం లోపాలను గుర్తించేందుకు నిష్పక్షపాత విచారణ జరగాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుందని, దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు తానా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
అంతకుముందు హత్రాస్ బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 80 వేల మందికి అనుమతి ఉంటే ఇంతమంది ప్రజలు అక్కడికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ తొక్కిసలాటలో ఈవెంట్ నిర్వాహకుల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ప్రధాన నిందితుడు మేనేజర్ దేవ్ ప్రకాష్ మధుకర్‌ని శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సేవాదార్లుగా పిచలిచే ఆరుగురిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి భోలే బాబా కోసం వేట సాగిస్తున్న పోలీసులకు అతని ఆచూకీ కనిపించడం లేదు.