నేడు అమరావతిలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు.
కోస్తా తీరం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం. నేడు ఏపీలో పలు జిల్లాలకు వర్షసూచన. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్.
నేడు తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన. వరంగల్, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన. ఖమ్మం, నిర్మల్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వర్ష సూచన.
నేడు రాయబరేలికి రాహుల్ గాంధీ. రాయబరేలి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్.
నేడు మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ పదాధికారుల సమావేశం. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం. ఈనెల 12న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల అజెండా తీర్మానాలపై చర్చ.
నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన. నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డ పర్యటన. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిపై చర్చించనున్న రేవంత్. విద్య, వైద్యం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్, ఇతర పెండింగ్ ప్రాజెక్ట్‌లపై సమీక్షించనున్న సీఎం రేవంత్.
రష్యాలో రెండోరోజు ప్రధాని మోడీ పర్యటన. 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న మోడీ. ఐదేళ్ల తర్వాత తొలిసారి రష్యాలో మోడీ పర్యటన. పుతిన్‌తో పలు ఒప్పందాలపై సంతకాలు.
నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,580 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.67,450 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,500 లుగా ఉంది.
నేడు సచివాలయంలో ఏపీ బ్యాంకర్ల కమిటీ సమావేశం. చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై చర్చించనున్న సీఎం చంద్రబాబు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైనా చర్చ.