తెలంగాణలో జీఓ 29 దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి గుదిబండ కాబోతోందా? బీజేపీ అగ్ర నాయకత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటోందా? వివాదం ముదిరితే ఏకంగా రాహుల్ గాంధీనే మాట్లాడటానికి ఇరుకున పడే ప్రమాదం ఉందా? ఇంతకీ ఏంటా జీవో 29? దానితో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? జీఓ నంబర్ 29ని రద్దు చేయాలని, జీఓ 55ను అమలు చేయాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు గ్రూప్ వన్ అభ్యర్థులు. దాని…
Rahul Gandhi: ఒడియా నటుడు బుద్దాదిత్య మొహంతి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని గురించి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ పెట్టిన కారణంగా బుద్దాదిత్యపై కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ ఎన్ఎస్యూఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ శుక్రవారం క్యాపిటల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుద్ధాదిత్య సోషల్ మీడియా పోస్టుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ అక్టోబర్ 23న (బుధవారం) వయనాడ్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 13న లోక్సభ ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్.. ప్రియాంక పేరును అధికారికంగా ప్రకటించింది. ప్రియాంక వెంట ఆమె భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీ ఉండనున్నారు.
Jharkhand Elections 2024: లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు (శనివారం) జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో పాల్గొననున్నారు.
రెండు పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, జార్ఖండ్లలో ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు మళ్లీ ప్రచారానికి దిగాయి. దళితుల ఓట్లను రాబట్టుకునే పనిలో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి.
Baba Siddique Murder: ప్రముఖ మహారాష్ట్ర నేత, ఎన్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య ఆ రాష్ట్రంలో పొలిటికల్ దుమారానికి కారణమైంది. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాయలం సమీపంలో గత రాత్రి కాల్చి చంపారు. ఈ హత్యని రాజకీయం చేయవద్దని బీజేపీ నేతృత్వంలోని మహా ప్రభుత్వం అభ్యర్థించగా..
దేశ వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా వేడుకలు అంబరాన్నంటాయి. మాదవ్ దాస్ పార్క్లో శ్రీ ధార్మిక్ లీలా కమిటీ నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
Rahul Gandhi: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు సమీపంలో భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
హర్యానాలో ఓటమి తర్వాత కాంగ్రెస్లో ఓటమిపై గుబులు మొదలైంది. సీనియర్ నాయకులు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా పార్టీలోని ఓటమికి అనేక కారణాలలో ఒకటి.