BJP: అదానీ లంచం ఆరోపణల్లో ప్రతిపక్ష రాష్ట్రాల పేర్లు.. రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్..
- అదానీ లంచం కేసులో 4 ప్రతిపక్ష రాష్ట్రాలు..
- రాహుల్ ఆరోపణలకు బీజేపీ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. అయితే, అదానీ గ్రూప్ నుంచి లంచాలు అందుకున్న రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలనలో ఉన్నాయని బీజేపీ పేర్కొంది. గౌతమ్ అదానీ అవినీతికి పాల్పడ్డారని, నరేంద్రమోడీతో చేతులు కలిపారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో.. ప్రధాని మోడీ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర గురువారం అన్నారు.
అదానీ గ్రూప్‌పై అమెరికా అభియోగాలు మోపిన నాలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ సీఎం లేరని, ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్, తమిళనాడులో కాంగ్రెస్, దాని మిత్ర పక్షమే అధికారంలో ఉన్నాయని చెప్పారు. 2021-2023 మధ్య రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ గ్రూప్ భారత ప్రభుత్వ అధికారులకు లంచాలుగా 265 మిలియన్ డాలర్లు చెల్లించిందని US ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. యూఎస్ నేరారోపణ చేసిన రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, తమిళనాడుతో పాటు ఒడిశా నవీన్ పట్నాయక్ పాలనలో, ఏపీలో వైఎస్ జగన్ పాలనలో ఉంది.
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
Read Also: Home Remedies For Cold: ఈ ఆయుర్వేద పద్ధతులను ఉపయోగించి జలుబు నుండి తక్షణ ఉపశమనాన్ని పొందండి ఇలా
భారతదేశం, భారతదేశాన్ని రక్షించే నిర్మాణాలపై దాడి చేయడం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యూహమని అన్నారు. రాహుల్ గాంధీ 2019లో ఇదే తరహాలో రాఫెల్ సమస్యని లేవనెత్తారు, కోవిడ్ సమయంలో వాక్సిన్ పనితీరుని ప్రశ్నించారు.. ఆ తర్వాత అతను సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని సంబిత్ పాత్ర గుర్తు చేశారు.
అంతకుముందు, బిలయన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో ఒక కేసు నమోదైంది. నిధుల సేకరణ కోసం లంచం ఇచ్చేందుకు ట్రై చేశారని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపింది. అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్ట్ కోసం 250 మిలియన్ డాలర్లను లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదైయ్యాయి. అయితే, ఈ ఆరోపణ్ని అదానీ గ్రూప్ ఖండించింది. ఈ అభియోగాలపై భారత్‌లో రాజకీయ వివాదం కొనసాగుతోంది. గౌతమ్ అదానీ అమెరికా, భాతర చట్టాలను ఉల్లంఘించారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!