Tarun Chugh : రాహుల్‌వి డ్రామాలు తప్ప.. ఏమీ లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ థీమ్ ఒక్కటే.. దేశ సంపదను దోచుకోవడం అంటూ ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా 12 లక్షల కోట్లను లూటీ చేశారని, రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్ అంటూ మండిపడ్డారు. దేశ సంపదను దోచిన పార్టీ ఇంకా ఖతమవ్వలేదు.. ఆ పార్టీ ఇంకా కొనసాగుతోందని, రైతుల కష్టాలపై ఎలాంటి చింత లేదు.. డ్రామాలు తప్పా ఏమీ లేవు అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ దేశానికి ఉపయోగపడే ట్వీట్లు కాకుండా విదేశీయులకు ఉపయోగపడే ట్వీట్లు చేస్తాడని, రాహుల్ ఇతర దేశాలు ఏవిధంగా పర్యటించారో.. తెలంగాణలోనూ అదే విధంగా పర్యటించారని ఆయన విమర్శించారు.
తెలంగాణలో రాహుల్ పర్యాటనకు పెద్దగా ప్రాధాన్యత లేదని, మోడీ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడని, దేశంలోని ముస్లింలు, జైన్లు, హిందువులు, బుద్ధులు, సిక్కులు ప్రతి ఒక్కరూ మోడీకి అండగా ఉన్నారన్నారు. అసదుద్దీన్ ఒవైసీ జిన్నా అవ్వాలని పరితపిస్తున్నాడని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాడని, కేసీఆర్, టీఆర్ఎస్ కి బీ టీమ్ గా ఓవైసీ పనిచేస్తున్నాడన్నారు. హైదరాబాద్ లో ముస్లింల చేతిలో ప్రాణాలు కోల్పోయిన దళిత కుటుంబానికి చెందిన వ్యక్తికి న్యాయం చేయాలని ఎస్సీ కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామంటే ఓవైసీ ఎందుకు భయపడుతున్నారని, ఎవరిని కాపాడటం కోసం ఇలా చేస్తున్నారని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.
Also Read
- Wanaparthy: పెళ్లి విందుకు ఆహ్వానం లేకుండా వెళ్తున్నారా? జైలు, జరిమానా తప్పదంటూ వార్నింగ్ బ్యానర్..
- Telangana High Court: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, డీసీపీ కోటిరెడ్డిలకు జైలు శిక్ష
- DGP CV Anand: "సిబ్బంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి".. ట్రాఫిక్ సమస్యలపై డీజీపీ కీలక వ్యాఖ్యలు..
- Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
తాజావార్తలు
-
Vivo X500 Series: వివో X500 సిరీస్ భారత్‌లో లాంచ్.. 200MP కెమెరా, 7800mAh బ్యాటరీ, ధర, ఫీచర్స్ ఇవే!
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Wanaparthy: పెళ్లి విందుకు ఆహ్వానం లేకుండా వెళ్తున్నారా? జైలు, జరిమానా తప్పదంటూ వార్నింగ్ బ్యానర్..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Hardik Pandya: ముంబై డిమాండ్లకు అంగీకరించని రాజస్థాన్.. హార్దిక్ విషయంలో అసలు ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!