కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌గాంధీ మేధావి అని.. యూపీఏ-2లో మన్మోహన్ సింగ్.. పదని పదవిని ఆఫర్ చేస్తే రాహుల్ గాంధీ కొన్ని సెకన్లలోనే తిరస్కరించారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభలో విపక్షాలకు కూడా మాట్లాడటానికి అవకాశం ఉండాలి అని డిమాండ్ చేశారు. సభలో నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నాను.. రక్షణ మంత్రి, ఇతరులు మాట్లాడతారు.. కానీ, విపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వలేదు అని మండిపడ్డారు.
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రేపటి (జూలై 21) నుంచి వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు “పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు” సాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 18 వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలకు శెలవు. మొత్తం ఏడు పెండింగ్ బిల్లుల తో పాటు, కొత్తగా మరో ఎనిమిది బిల్లులను ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. కొత్తగా గౌహతిలో ఐఐఎమ్ ఉన్నత విద్యాసంస్థను నెలకొల్పేందుకు…
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కఠిన పదజాలంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. మణిపూర్ సంక్షోభం గురించి పట్టించుకోకుండా మోడీ ఎక్కువగా టీవీల్లో కనిపిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని తరుచుగా మీడియాకు రావడాన్ని ఖర్గే తప్పుపట్టారు. మోడీ ప్రతీ రోజూ టీవీల్లో కనిపిస్తారని, ఆయన టీవీ స్ట్రీన్‌పై లేని రోజు లేదని, ప్రభుత్వ టెలివిజన్ దూరదర్శన్ ఉన్నప్పటికీ, గతంలో ఏ ప్రధాని కూడా రోజూ తెల్లవారుజామున టీవీల్లో మొరిగింది లేదని ఖర్గే విమర్శించారు.
Rahul Gandhi: మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత్, పాకిస్తాన్ వివాదంలో మొత్తం 5 యుద్ధ విమానాలు కూలినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను నివారించినట్లు ట్రంప్ చెప్పుకుంటున్నారు. పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అయినప్పటికీ, ట్రంప్ వినిడం లేదు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ వివాదానికి కారణమయ్యాయి.
వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన రాహుల్.. నా బావ రాబర్టుని ఈ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వెంటాడుతోంది అని ఆరోపించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం (జూలై 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
KTR : ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ముసుగు వీడింది. నేటితే అసలు గుట్టు బయట పడింది. తెలంగాణ నిధులను రాహుల్ గాంధీకి, నీళ్లను చంద్రబాబు నాయుడికి ఇవ్వడానికి రేవంత్ రెడీ అయ్యారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ రోజు జరిగిన మీటింగ్ లో అసలు బనకచర్ల ప్రస్తావన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ఏపీ మొదటి ప్రతిపాదనే…