దేశ భద్రతపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరని జస్టిస్ దీపాంకర్‌దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్ షా సరికొత్త రికార్డ్.. దేశ చరిత్రలో ఆయనకే సొంతం
రాహుల్‌గాంధీ వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు మందలించడంపై వయనాడ్ ఎంపీ, రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంకాగాంధీ స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుడి విధి అని గుర్తుచేశారు. అయినా నిజమైన భారతీయుడు ఎవరో నిర్ణయించేది మీరు కాదని.. గౌరవనీయులైన న్యాయమూర్తులు.. దేశ ప్రతిపక్ష నేతకు తగిన గౌరవం ఇవ్వాలన్న విషయం గుర్తించుకోవాలని పేర్కొన్నారు. అయినా తన సోదరుడు ఎప్పుడూ సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని.. వారిని అత్యున్నతంగా గౌరవిస్తారని తెలిపారు. అలాంటిది తన సోదరుడి గురించి ధర్మాసనం వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు తప్పుడు వివరణగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mayasabha: “మయసభ”లో పరిటాల రవి పాత్ర ఉంటుందా?
భారతదేశంలో 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని డిసెంబర్ 16, 2022న భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం ఈ వ్యాఖ్యల్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు? విశ్వసనీయ సమాచారం ఏంటి? మీరు నిజమైన భారతీయులైతే.. మీరు ఇలా మాట్లాడరు. సరిహద్దుల్లో వివాదం ఉన్నప్పుడు.. ఇదంతా ఎందుకు? అని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్నే ప్రియాంకాగాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. న్యాయమూర్తులు తగిన గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు.