రాహుల్ గాంధీని ఇల్లు ఖాలీ చేయమనడం బీజేపీ కక్ష్య సాదింపే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసిన కుటుంబాల పట్ల బీజేపీకి గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vivek Agnihotri: ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో దేశం మొత్తం అగ్గిరాజేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయనకు వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం ఏదో ఒక వివాదంలో వివేక్ పేరు వినిపిస్తూనే ఉంటుంది.
ఎంపీగా తనకు కేటాయించిన తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీని లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ కోరింది. పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో పార్లమెంటుకు అనర్హత వేటు వేసిన రెండు రోజుల తర్వాత లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నుంచి తొలగింపు నోటీసు వచ్చింది.
తాను సావర్కర్ కానందున క్షమాపణ చెప్పబోనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థులైన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, శివసేన అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మధ్య ఐక్యతకు దారితీసింది. కాగా, 2019 పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు గాంధీని దోషిగా నిర్ధారించిన మరుసటి రోజు, శుక్రవారం లోక్‌సభకు గాంధీ అనర్హుడయ్యాడు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం పార్లమెంట్ ఉభయసభనలు కుదిపేసింది. రాహుల్ గాంధీని పార్లమెంటుకు అనర్హులుగా ప్రకటించడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్ సభ, రాజ్యసభ రెండూ వాయిదా పడ్డాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ సోమవారం లోక్‌సభలో వాయిదా నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై చర్చించేందుకు ఈ సభ జీరో అవర్‌లో అవకాశం ఇవ్వాలని నోటీసులో కోరారు.
క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్ కాదు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాకరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.