సిద్దిపేటలో పల్లె పల్లెకు సీపీఐ అని నిర్వహిస్తున్న చైతన్య యాత్రలో CPI నేత చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదు అని అంటూ కామెంట్స్ చేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ నుంచి దేశానికి నష్టం అని భావించే… BRS పార్టీని ఏర్పాటు చేశాడు అని చాడ వెంకటరెడ్డి అన్నాడు. BRS తో కలిసి పని చేస్తాం.. 72 లక్షల కోట్ల నల్లధనం బయటకు తెస్తా.. రెండు కోట్ల ఉద్యోగులు ఇస్తా అని మోడీ అదాని లాంటి వాళ్ళ కొమ్ము కాస్తున్నాడు అని విమర్శలు గుప్పించాడు.
Also Read :
ఆర్ఎస్ఎస్ ,సంఘ్ చేతల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలన చేస్తున్నాడు అని సీబీఐ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నాడు. ఒకే దేశం, ఒకే పాలన అన్నా మోదీ ఆయన పాలన ఎటు పోయింది అంటూ విమర్శలు గుప్పించాడు. రైతుల కోసం సాగు చట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీశాడని చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. గ్యాస్, డీజల్ రేట్లు పెంచిన మోడీకి, మహిళలు కర్ర కాల్చి వాతలు పెట్టె రోజులు దగ్గర పడ్డాయంటూ విమర్శాలు చేశాడు. గుజరాత్ లో బూటకపు ఎన్ కౌంటర్ చేసిన అమిత్ షా గుజరాత్ నుంచి బహిష్కరణ చేస్తే ఇప్పుడు ఎలా హోమ్ మంత్రి అయ్యాడు అంటూ చాడ ప్రశ్నించాడు. రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి పంపించి ప్రతిపక్షం అనేది లేకుండా భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్ర అంటూ సీబీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు.
Also Read :