కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లంకాధిపతి రావణుడి అవతారంలో ఉన్న రాహుల్ గాంధీ ఫోటోను షేర్ చేస్తూ బీజేపీ వివాదాస్పద క్యాప్షన్‌ను జోడించింది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్‌లో జరిగిన తరహాలో రాష్ట్రంలో కూడా కులాల సర్వే నిర్వహిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
ప్రతిపక్ష ఇండియా కూటమిని నిజమైన సవాల్‌గా భావిస్తున్నానని కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం అన్నారు. తన సొంత రాష్ట్రం ఒడిశా నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనను అనుమతించాలని తన పార్టీని అభ్యర్థించినట్లు తెలిపారు.
INDIA Bloc: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై నేతలు చర్చించారు. సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశమైన ఇండియా కూటమి, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలిసింది.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కలిశారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశం కాగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి కోసం ముందుకు సాగే ప్రణాళికపై చర్చించినట్లు తెలిసింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి ఆయన చేసిన ప్రకటనలేవీ కాకుండా కుక్కపిల్ల పేరు కారణంగానే వివాదం తలెత్తింది. కుక్కపిల్లకి నూరి పేరు పెట్టడంపై అసదుద్దీన్ ఒవైసీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినే రాహుల్ గాంధీ, తన తల్లికి సర్ఫ్రైజ్ గిఫ్టు ఇచ్చారు. ఒక కొత్త వ్యక్తిని తన కుటుంబంలో పరిచయం చేశారు. సోనియా గాంధీకి ఒక పెంపుడు కుక్కను గిఫ్టుగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు.
Rahul Gandhi: దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రం కులాల వారీగా సర్వే చేసింది. కుల గణన ఫలితాలను ఈ రోజు వెల్లడించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం చేసిన ఈ పనిని కాంగ్రెస్ స్వాగతించింది. సామాజిక న్యాయం చేయడానికి, సామాజిక సాధికారత కోసం జాతీయ స్థాయిలో ఇలాంటి కసరత్తు చేయాలని కేంద్రాన్ని కోరింది.
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సందర్శించారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాహుల్ ఒక సాధారణ భక్తుడిలా ప్రార్థనల్లో పాల్గొన్నారు. తన తలకు బ్లూ స్కార్ఫ్ దరించారు. అనంతరం స్వచ్ఛంద సేవల్లోనూ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఇతర భక్తులతో కలిసి ఆలయ ప్రాంగణంలో భక్తులు ఉపయోగించిన గిన్నెలను రాహుల్ శుభ్రపరిచారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేశారు. శనివారం మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీలో పాల్గొన్నారు.