రాజవంశ రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాజకీయ పరిజ్ఞానం లేని నిరక్షరాస్యుడు అని రాహుల్ గాంధీని విమర్శించారు.
MLC Kavitha: బీసీల గురించి మాకు రాహుల్ చెప్పాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో పర్యటనలో వున్న కవిత మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై మండిపడ్డారు. గత పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు.
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగుతుంది. ఇందుకోసం బస్సు యాత్రలు చేసేందుకు రెడీ అయింది. బస్సు యాత్రను ప్రారంభించేందుకు జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగుతుంది. ఇందుకోసం బస్సు యాత్రలు చేసేందుకు రెడీ అయింది. బస్సు యాత్రను ప్రారంభించేందుకు జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు. మూడు రోజుల పాటు.. 8 నియోజకవర్గాల్లో సాగే ఈ బస్సు యాత్రలో రాహుల్ పర్యటించనున్నారు.
Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ హింసాకాండ కన్నా ఇజ్రాయిల్ -హమాస్ యుద్ధంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మిజోరాంలో వచ్చే నెల ఎన్నికలు ఉండటంతో ఆ రాష్ట్రంలో సోమవారం పర్యటించారు. ఇజ్రాయిల్ లో ఏం జరుగుతుందనే దానిపై ప్రధాని, భారత ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి కనబరచడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది, కానీ మణిపూర్ లో ఏం జరుగుతుందనే దానిపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
India vs Pakistan: శనివారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. పాక్ ఏ దశలోనూ ఇండియాకి పోటీ ఇవ్వలేకపోయింది. రోహిత్ శర్మ సిక్సర్ల సునామీ ముందు పాక్ బౌలర్లు తేలిపోయారు. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో లక్షల మంది ప్రేక్షకులతో పాటు టీవీ సెట్ల ముందు, మొబైళ్లలో కోట్ల మంది భారతీయులు ఈ మ్యాచును వీక్షించారు. వరల్డ్ కప్ లో భారత్ కు ఎదురులేదని, పాకిస్తాన్ ను 8వ సారి ఓడించి నిరూపించారు.
5 రాష్ట్రాల ఎన్నికలకు ఎల క్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చాలా కీలకం కాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
దేశవ్యాప్తంగా కులగణనకు ఇవాళ సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని రాహుల్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుల గణనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని, ఇది చారిత్రాత్మక నిర్ణయం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం అన్నారు. విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఉదయం నాలుగు గంటలపాటు సమావేశమై కుల గణనపై చర్చించిందని అన్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శనివారం దేశ రాజధానిలో జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.