Rahul Gandhi: తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి.. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారు: రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Leader Rahul Gandhi Slams BRS Over Kaleswaram Project: బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారని విమర్శించారు. నాసిరకం నిర్మాణం కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ పలు పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. గురువారం ఉదయం మేడిగడ్డ బ్యారేజ్‌ను రాహుల్ సందర్శించారు. ప్రాజెక్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ముందుగా సందర్శనకు అనుమతి ఇవ్వలేదు. చివరకు కాంగ్రెస్ శ్రేణుల రిక్వెస్ట్‌తో ఏరియల్ సర్వేకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో రాహుల్ మేడిగడ్డను పరిశీలించారు.
మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన అనంతరం రాహుల్ గాంధీ తన ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ = కేసీఆర్ కుటుంబం ఏటీఎం. మేడిగడ్డ బ్యారేజీని నేను ఈరోజు సందర్శించాను. తెలంగాణలో అవినీతితో నిండిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో ఇది ఒక భాగం. నాసిరకం నిర్మాణం కారణంగానే పలు పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. పిల్లర్లు కుంగుబాటుకు గురవుతున్నట్లు నివేదికలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మరియు ఆయన కుటుంబం తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారు’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Also Read
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
Also Read: IND vs SL: నేను కూడా బ్యాడ్ కెప్టెన్.. కెప్టెన్సీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
మేడిగడ్డ సందర్శనకు ముందు రాహుల్ గాంధీ అంబట్పల్లి కాంగ్రెస్ మహిళా సదస్సులో పాల్గొన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం కరెప్షన్ చేసింది. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలైంది. ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన డబ్బులు.. ప్రాజెక్టు నిర్మాణం కోసమే పూర్తిగా ఖర్చు పెట్టి ఉంటే ఇలాంటి కుంగుబాటు వచ్చేవి కాదు. ప్రాజెక్టుకు కేటాయించిన లక్ష కోట్లల్లో సగం డబ్బులను దోపిడీ చేసి.. నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే బ్యారేజ్ పిల్లర్లు కుంగాయి’ అని రాహుల్ ఫైర్ అయ్యారు.
Kaleshwaram Project = KCR Family ATM
I visited the Medigadda barrage, which is a part of the corruption-ridden Kaleshwaram Lift Irrigation Scheme in Telangana.
Cracks have developed in multiple pillars because of shoddy construction with reports indicating that the pillars are… pic.twitter.com/BWe8Td9mCq
— Rahul Gandhi (@RahulGandhi) November 2, 2023
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!