Minister Srinivas Goud: రాహూల్ గాంధీ పొర్లు దండాలు పెట్టినా.. పది సార్లు పర్యటించినా.. మీ పార్టీ అధికారంలోకి రాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ.. కుటుంబ పరిపాలన అంటారు.. మీకున్న అర్హత ఎంటి? అని ప్రశ్నించారు. మీరు లీడర్ వా.. రీడర్ వా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర తెలుసా.. ఉద్యమంలో చనిపోయిన వారు కాంగ్రెస్ వల్లనే కదా? అని మండిపడ్డారు. BJP పార్టీ BRS లు ఒక్కటే అంటారు.. గతంలో ఎన్నికలు ఉన్నపుడు.. మీరు అక్కడికి వెళ్లకుండా.. జోడో యాత్ర చేశారని గుర్తు చేశారు. మరి మీరా తొత్తులు.. మేమా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదకొండు సార్లు మీకు అధికారం ఇస్తే.. సాగునీరు.. తాగు నీరు ఇవ్వకుండా.. పోటిరెడ్డిపాడు బొక్క కొట్టి.. RDS బద్దలు కొట్టి నీళ్ళు దోచుకు పోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పదేళ్లలో దేశంలోనే అత్యధిక GDP తెలంగాణది అన్నారు. ఇప్పుడు BRS మహారాష్ట్ర లో విస్తరిస్తుంటే.. మీకు బుగులు పుట్టుకుని.. మాపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ అవసరాల గురించి.. BC లను.. మైనారిటీ లను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు సార్లు MLA గా ఐన ఎర్ర శేఖర్ కు టిక్కెట్ జడ్చర్లలో ఇవ్వకుండా.. ఇతరులకు ఇవ్వడంతోనే BC లపై మీ కపట ప్రేమ జనం తెలుసుకున్నారని అన్నారు. మీరెన్ని రోడ్ షోలు చేసినా.. డ్రామాలు చేసినా జనం నమ్మరు.. KCR ను KTR లను తిట్టి పెద్ద నాయకుల అవుతారనుకుంటున్నారా? ప్రశ్నించారు. మీరు ఎన్ని గెలుస్తారు.. ఎన్నింట్లో డిపాజిట్ వస్తదో చూద్దాం అంటూ సవాల్ విసిరారు. మా పార్టీలో చెల్లని వాళ్లకు టిక్కెట్లు ఇచ్చారన్నారు. మా నాయకుడు గల్లీలో ఉంటాడు.. మీ నాయకుడు డిల్లీ లో ఉంటాడని వ్యంగాస్త్రం వేశారు. మీ పార్టీలో డజను మంది సీఎంలు ఉంటారుని, పగటి కలలు కంటున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు బొంద పెడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ మోసాల నుంచి బయట పడి.. ఎంతోమంది నాయకుల మా పార్టీ లోకి వస్తున్నారని అన్నారు. రాహూల్ గాంధీ పొర్లు దండాలు పెట్టినా.. పది సార్లు పర్యటించినా.. మీ పార్టీ అధికారంలోకి రాదని అన్నారు.
మరో వైపు మాజీ MLA ఎర్ర శేఖర్ మాట్లాడుతూ.. బడుగు బలహీనర్గాలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందన్నారు. జడ్చర్ల.. మహబూబ్ నగర్.. దేవరకద్రల్లో కాంగ్రెస్ చేసిన మోసానికి గుణపాఠం చెప్పాలని BRS లో చేరానని తెలిపారు. రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి లు ఇపుడు టిక్కెట్ లు అమ్ముకున్నారు.. భవిష్యత్ లో రాష్ట్రాన్ని అమ్మేస్తారని తెలిపారు. పాలమూరు జిల్లాలో ముదిరాజ్ లు అందరూ BRS కు అండగా ఉండాలన్నారు.
IND vs SL: భారత్-శ్రీలంక ప్రపంచకప్ సమరం.. లాస్ట్ 5 మ్యాచ్‌లలో ఎవరిది పైచేయంటే?