తెలంగాణ సర్కారుకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలపడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఏం సాధించిందని కాంగ్రెస్ సర్కారుకు శుభాభినందనలను చెప్తున్నాడో రాహుల్ గాంధీ..? అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) రాజ్యసభకు (Rajya Sabha) పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నారు.
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. సోమవారం రాహుల్ పర్యటన ప్రారంభానికి ముందు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్.. రాహుల్‌తో భేటీ అయింది.