సూర్యాపేట వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటనలో…ఆరుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహం నుంచి శాశ్వతంగా పంపించేశారు. సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి ఇబ్బందులకు గురిచేసిన ఆరుగురు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2019-20 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు జె.మహేందర్, జి.శశాంక్,…
వరంగల్ కాకతీయ వైద్యకళాశాలలో ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా, అధికారులు ఆంక్షలు విధించినా.. ర్యాగింగ్ కొనసాగుతోంది. జాతీయ కోటాలో సీటు సాధించిన మొదటి సంవత్సరం విద్యార్థిని.. తృతీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు, బట్టలూడదీసి ర్యాగింగ్ చేయడం కలకలం రేపింది.బాధిత విద్యార్థి.. సీనియర్ల ర్యాగింగ్ చేసిన విషయాన్ని, రాజస్థాన్‌లో ఉన్న తమ కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు వైద్యకళాశాలకు వచ్చి, ర్యాగింగ్ చేసిన విద్యార్థులతో మాట్లాడారు. మరోవైపు.. రాష్ట్ర వైద్యశాఖ…