సీఈఓ వికాస్ రాజ్ ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు శుక్రవారం కలిశారు. మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని సీఈఓ కు ఫిర్యాధు చేశారు రఘునందన్ రావు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఒక్కో ఓటర్ కు 5వందల రూపాయలను పంపిణీ చేశారని, ఎన్నిసార్లు ఫిర్యాధు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదన్నారు. బూత్ ల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్ లలో ఒక్కో గ్రామానికి డబ్బుల పంపిణీ చేశారని, 20కి…
సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఓటేసేందుకు వెళ్లి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయాల గురించి మాట్లాడారని ఆయన విమర్శించారు.
సిద్దిపేట జిల్లా బీజేపి కార్యాలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. నిన్న కేసీఆర్ తనపై మాట్లాడిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. రఘునందన్ రావు దుబ్బాక లో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డి లో ఓడిపోలేదా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినా కేసీఆర్ కి సిగ్గు ఉండాలని, వెంకట్రామిరెడ్డి ఎన్ని కోట్లు ఇస్తే కేసీఆర్ మెదక్ సీటు ఇచ్చాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్…
Harish Rao: రఘునందన్ రావు ఫేక్ వీడియోలు చేయిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పై ఫేక్ వీడియోల ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
మెదక్ లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసే కుట్ర చేస్తుందని 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మోడీ మారుస్తాడని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందని…
సిద్దిపేటను 40 ఏళ్లుగా ఒకే కుటుంబం దోచుకుంటుందని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు ఆ కుటుంబాన్ని వద్దనుకొని బీజేపీని కోరుకుంటున్నారన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో రఘునందన్ రావు మాట్లాడారు.
జూన్ 4న కమలం వికసించబోతోందన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు. ఇవాళ ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్‌లో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, బీజేపీ- బీఆర్‌ఎస్ ఒక్కటే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 7 నుంచి 14 శాతం వరకు ఓట్లు పెంచుకున్నామన్నారు రఘునందన్ రావు. ఒక సీటు నుంచి 7 అసెంబ్లీ సీట్లకు బీజేపీ…
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల వాగ్దానాలు రాజకీయ స్టంట్‌గా మారాయని, రైతులను ఆదుకోవాలని బీజేపీ మెదక్ అభ్యర్థి ఎం. రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ‘‘ఆగస్టులోగా సీఎం వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తారని రైతులు ఆశించకూడదు. అది జరగదు. ఆయన చేసిన వాగ్దానాలన్నీ ప్రజల ఓట్లను పొందేందుకు…
Raghunandan Rao: రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేనని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మోడీ పాలన చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రఘునందన్ రావు మాట్లాడుతూ.. దేశంలో 400 సీట్లు గెలుస్తాం...అందులో మెదక్ సీటు కూడా ఉందన్నారు. రేపు నామినేషన్ లు వేసే వ్యక్తి కులాన్ని నమ్ముకొని వస్తున్నారు..